Tirumala Tirupati Devasthanam: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆలయాలపై దాడులు ముఖ్య చర్చనీయాంశంగా ఉంది. దీంతో ఆలయాలపై నిఘా పెరుగుతోంది. ఆలయాలు, దేవస్థానాలకు సంబంధించిన ఆస్తులపై సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం తిరుపతిలో ఉన్న ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా చేసేందుకు చర్యలు ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తిరుమల తిరుపతి దేవస్థానం(TTD Latest News) అధికారులు ఆలయానికి చెందిన స్థిర ఆస్తులు ఇప్పుడు పూర్తిగా బోర్డులు మరియు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఆలయ జేఈఓ సదా భార్గవి పర్యవేక్షిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, ఇతర విషయాలతో ఆమె అప్రమత్తమయ్యారు.


Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు



జేఈఓ సదా భార్గవి ఇటీవల తిరుమల(Tirumala) ఆలయం ఆస్తులను పరిశీలించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో టీటీడీ ఆస్తులకు  సరైన ఫెన్సింగ్ లేదని ఆమె గమనించారు. ఈ క్రమంలో టీటీడీ ఆస్తుల వద్ద భద్రతను పెంచడంతో పాటు ఆస్తుల వివరాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పెన్సింగ్‌ను సైతం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.


Also Read: RBI Big Decision: పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం 



ఇటీవల జేఈఓ సదా భార్గవి ఆదేశాలతో పలు ఆస్తులకు భద్రతా కంచె ఏర్పాటు చేయడం తెలిసిందే. మొత్తంగా 22 ఆస్తులకు బోర్డులు, పెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందులో బైరగిపట్టేడా 8 ఆస్తులు ఉండగా, వైకుంటపురం మరియు ఎంఆర్ పల్లి వద్ద మరో 14 టీటీడీ ఆస్తులున్నాయి.


Also Read: Gold Price Today: మళ్లీ పతనమైన బంగారం ధరలు, పసిడి దారిలోనే దిగొచ్చిన వెండి ధరలు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook