Gold Price Today On 25th January 2021: జనవరి రెండో వారంలో బులియన్ మార్కెట్‌లో తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా మరోసారి క్షీణిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు, వెండి ధరలు పతనమయ్యాయి. బంగారు కొనుగోలుదారులు ఇప్పుడే త్వరపడండి.
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర రూ.330 మేర దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.50,120 అయింది. 22 క్యారెట్లపై రూ.150మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,940కి పతనమైంది. ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయం నుంచి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతలోనే పతనమవుతున్నాయి.
Also Read: EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర(Gold Price Today On 25th January 2021) రూ.160 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,470 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.150 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,100కి పతనమైంది.
Also Read: EPFO Benefits: ఈపీఎఫ్ ఖాతాదారులకు 5 బెనిఫిట్స్
దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.700 మేర పతనమైంది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,700 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,150 మేర దిగొచ్చింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.71,300కు పతనమైంది.
Also Read: SBI Alert: పాన్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఈ ఎస్‌బీఐ ట్రాన్సాక్షన్స్ చేయలేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook