Tirumala Tirupati Devasthanam July Quota:  తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌ కోటా శ్రీవారి దర్శనం జూలై మాసానికి సంబంధించినవి ఈరోజు అంటే ఏప్రిల్ 18 నుంచి విడుదల చేసింది. శ్రీవారి అర్జిత సేవ, దర్శనం టిక్కెట్లు, గదులు, శ్రీవారి వలంటరీ సర్వీసులకు సంబంధింన టిక్కెట్లను విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కోటా బుకింగ్‌ ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి 27 వరకు కొనసాగుతుంది. టీటీడీ దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.in ద్వారా బుకింగ్‌ చేసుకోవాలని టీటీడీ యంత్రాంగం తెలిపింది. ఆన్‌లైన్ లక్కీ డిప్ సేవ, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదమర్దనం సేవ జూలై మాసానికి సంబంధించిన టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. 


ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్‌ 18 ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ మొదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లనున్న భక్తులు లక్కీ డిప్‌ ఫీజు ఏప్రిల్ 22 లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22 రోజు టీటీడీ శ్రీవారి ఆర్జిత సేవలను ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనుంది.  ఇందులో కల్యాణోత్సవం, ఊంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర్త దీపాలంకర సేవకు సంబంధింన టిక్కెట్లను విక్రయించనున్నారు. 


ఇదీ చదవండి:  రేపే కామద ఏకాదశి.. ఈ 5 రాశులకు విష్ణువు అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం..


ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్చూవల్ సేవ టిక్కెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది.  అంగప్రదక్షిణ టోకెన్లను ఏప్రిల్ 23 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. దర్శనం, గదుల బుకింగ్‌, శ్రీవారి ట్రస్ట్‌ డోనర్స్ ఉదయం 11 గంటల నుంచి ఉంటాయి. ఇక వృద్ధులు, దివ్యాంగుల కోటా 3 గంటల నుంచి ఏప్రిల్ 23 న అందుబాటు ఉంచనుంది.


ఇదీ చదవండి: జానకిని పెళ్లాడిన రామయ్య..  భద్రాచలంలో కల్యాణ వైభోగం


రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఏప్రిల్ 24 నుంచి ఉదయం 10 కు ప్రారంభించనుంది. గదుల బుకింగ్ కూడా అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంచనుంది. ఇక శ్రీవారి వలంటరీ సేవ ఏప్రిల్ 27న ఉదయం 11 గంటల నుంచి బుక్‌ చేసుకోవచ్చు. నవనీత సేవ 12 గంటలు, పరకామణి సేవలకు సంబంధించిన బుకింగ్ మధ్యాహ్నం 1 గంటకు అందుబాటులో ఉంచుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook