Kamada Ekadashi Rashifal: రేపే కామద ఏకాదశి.. ఈ 5 రాశులకు విష్ణువు అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం..

Kamada Ekadashi Rashifal: ఏడాదిలో 24 ఏకాదశిలు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశి విష్ణువుకు అంకితం చేసింది. రేపు ఏప్రిల్ 19న కామద ఏకాదశి రానుంది. ఈరోజు విష్ణుపూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Kamada Ekadashi Rashifal: ఏడాదిలో 24 ఏకాదశిలు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశి విష్ణువుకు అంకితం చేసింది. రేపు ఏప్రిల్ 19న కామద ఏకాదశి రానుంది. ఈరోజు విష్ణుపూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి వ్రతం ఆచరించి కథ వింటే పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు నుంచి 5 రాశులకు అదృష్టం కలిసివస్తుంది. గ్రహాల యువరాజు బుధుడు మీన రాశిలో ఉదయిస్తాడు. దీంతో వీరికి ఆకస్మిక డబ్బు లాభం కలుగుతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
 

1 /5

మేష రాశి.. బుధుడు మీన రాశిలో ఉదయించడం వల్ల మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది. దీంతో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో మేషరాశికి చెందిన విద్యార్థులకు బాగా కలిసి వచ్చే సమయం. ఈ రాశివారికి ఉద్యోగ వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. 

2 /5

మిథునరాశి.. మిథునరాశివారికి ఈ సమయం మంచికాలం.  ఈ రాశివారు కొత్తగా వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు.  అంతేకాదు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. విద్యార్థులకు కూడా ఇది మంచి ఫలితాలను ఇచ్చే సమయం.

3 /5

సింహ రాశి.. విష్ణువు అనుగ్రహంతో సింహ రాశివారికి కూడా శుభసమయం. వీరి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. అంతేకాదు సింహ రాశివారికి కుటుంబంలో సఖ్యత మెరుగుపడుతుంది. సింహ రాశివారి ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

4 /5

కన్యా.. విష్ణుమూర్తి అనుగ్రహంతో వీరికి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశివారి వ్యాపారంలో బాగా కలిసివచ్చింది. ఈ సమయంలో భాగస్వామితో ఆనందంగా కలిసి ఉండే సమయం. ఇది మానసిక ప్రశాంతత ఇచ్చే సమయం.

5 /5

ధనస్సు.. ధనస్సు రాశివారి వ్యాపారం మెరుగుపడే సమయం. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ధనస్సు రాశివారు తమ వ్యాపారం పుంజుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)