Mangalavaram cheyakudani panulu: మంగళవారం అంటేనే కొన్ని పనులు చేయడానికి వీల్లేదని చెబుతుంటారు కొంతమంది పెద్దలు. మంగళవారం నాడు తలపెట్టే పనులకు శుభం జరగదు అనేది వారి భావన. మంగళవారం నాడు కొన్ని రకాల పనులు చేస్తే శుభం జరగకపోగా... అశుభం జరుగుతుందనేది ఇంకొంతమంది భయం. ఇంతకీ కొంతమంది పెద్దలు చెబుతున్నట్టుగా మంగళవారం చేయకూడని పనులు ఏంటి అనేదే (Things not to do on Tuesday) చాలామందిని వేధిస్తోన్న ఒక ధర్మ సందేహం. అదేంటనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం నాడు గోర్లు కత్తిరించడం (Can we cut nails on Tuesday) శుభం కాదని కొంతమంది పెద్దలు చెబుతుంటారు. 


మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం, క్షవరం చేయించుకోవడం (Hair cut on Tuesday) వల్ల కీడు జరుగుతుందనేది కొంతమంది పెద్దలకు ఉన్న బలమైన విశ్వాసం.


Also read : Horoscope November 16 2021: ఈ రోజు మంగళవారం.. ఆ రాశివారికి వ్యాపారంలో లాభం కలుగుతుంది


మంగళవారం రోజున (Mangalavaram) ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే.. ఆ డబ్బు తిరిగి రాదు అని కూడా అంటుంటారు.


మంగళవారం రోజు కొత్త బట్టలు ధరించకూడదు అనేది ఇంకొంతమందికి ఉండే నమ్మకాల్లో (New dress sentiments) ఒకటి. 


మంగళవారం ప్రయాణాలకు అనువు కాదని... అలా ప్రయాణాలు చేసి తలపెట్టే ఏ పనులు కూడా విజయవంతం కావు అనే భావన (Mangalavaram prayanam cheyodda ?) కూడా ఉంది.


Also read : Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!


కొంతమంది మంగళవారం నాడు ఆంజనేయస్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి (Lord Hanuman puja vidhi on tuesday) ఉపవాసం ఉంటుంటారు. అలా ఒక్కపొద్దు ఉండి రాత్రి వేళ భోజనం చేసేటప్పుడు ఉప్పు వేసిన భోజనం చేయకూడదు అని పండితులు చెబుతున్నారు.


మంగళవారం తలస్నానం (Head bath on tuesday) చేయకూడదని.. అలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుందనే విశ్వాసం కూడా ఉంది.


Also read : Diwali Vastu Tips: దీపాలను దక్షిణంవైపు తిప్పకండి..లక్ష్మీపూజ సాయంత్రం 6.32గం-8.21గం చేయాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook