Horoscope for November 16: గ్రహాలు, తిథి, నక్షత్రం అంశాలకు అనుగుణంగా రాశి ఫలాల్ని. సదరు వ్యక్తులకు ఎదురయ్యే మంచి చెడుల్ని నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. గ్రహాల కదలిక ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుండే ఈ రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాశివారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మరి మీ రాశి ఫలాలు ఇవాళ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషరాశి Aries: అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి ఇవాళ పనులలో జాప్యం ఉంటుంది. దూర ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యయప్రయాసలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురు కావచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజలు చేయాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
వృషభరాశి Taurus: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.
మిధునరాశి Gemini: మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి ఇవాళ కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహార విజయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేస్తే మంచిదంటున్నారు.
కర్కాటకరాశి Cancer పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో అకారణంగా తగాదాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు. ఆరోగ్య భంగం. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలలో లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించాలని సూచిస్తున్నారు.
సింహరాశి Leo : మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి ఈ రోజు కుటుంబంలో చికాకులు ఎదురౌతాయి. మానసిక అశాంతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు ఆటుపోట్లు ఉంటాయి. పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేస్తే అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు.
కన్యారాశి Virgo:ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయాలని సూచిస్తున్నారు.
తులారాశి Libra: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి ఈ రోజు కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త ఆశలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలని సూచన.
వృశ్చికరాశి Scorpio: విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి ఈ రోజు వ్యయప్రయాసలు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. ఇంట్లోనూ బయటా సమస్యలు. దూర ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు బదిలీలు.
ధనుస్సురాశి Sagittarius: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులతో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపార విస్తరణ యత్నాలు వాయిదా పడవచ్చు. ఉద్యోగ మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిదంటున్నారు.
మకరరాశి Capricorn: ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి ఈ రోజు ఆసక్తికర సమాచారాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి Aquarius: ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా సమస్యలు. బంధువర్గంతో విరోధాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు స్థాన చలనం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించాలని సూచన.
మీనరాశి Pices: పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి ఈ రోజు నూతన ఉద్యోగయోగం. మిత్రుల నుంచి కీలక సమాచారం. రాబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు కీలక సమాచారం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేస్తే మంచిది.
Also read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook