Tulsi Plant Remedies: నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకు పరిష్కారముందంటున్నాయి జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు. ఆర్ధికపరమైన కష్టాలుంటే..తులసి మొక్కకు ఆ ఒక్కటి ఆర్పిస్తే చాలంట. అంతులేని సంపదలు కలుగుతాయంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమమతంలో జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలకు విశేష ప్రాధాన్యత ఉంది. రాశి, గ్రహాల కారణంగా ఎదురయ్యే చాలా సమస్యలకు పరిష్కారం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో మీరు కూడా ఆర్ధికపరమైన ఇబ్బందులతో సతమతమవుతుంటే..ఇంట్లో నెగెటివ్ శక్తిని దూరం చేయాలంటే తులసి మొక్కతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం...


తులసీమొక్క ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది కేవలం శుభ సూచకమే కాకుండా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేందుకు కూడా ఉపయోగపుడుతుంది. తులసి మొక్కతో కొన్ని చిట్కాలు లేదా ఉపాయాలు పాటిస్తే మీ ఇంట్లో సుఖ శాంతులు కలగడమే కాకుండా డబ్బుల సమస్య పూర్తిా దూరమౌతుంది. తులసి మొక్కకు ఆ ఒక్క వస్తువు అర్పిస్తే లక్ష్మీదేవి, విష్ణువుల కటాక్షం లభిస్తుంది. తులసి మొక్క ద్వారా కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. 


మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే..ఆ మొక్కలు నీళ్లతో పాటు పాలు కూడా సమర్పించవచ్చు. పచ్చి పాలు పోయడం వల్ల చాలా మహత్యముంటుంది. అమితమైన లాభాలు కలుగుతాయి. తులసి మొక్కకు నియమిత పద్ధతిలో నీళ్లలో పచ్చి పాలు కొద్దిగా కలిపి అభిషేకం చేస్తే విష్ణువు ప్రసన్నమౌతాడని ప్రతీతి. దాంతోపాటు ఆ వ్యక్తికి సుఖ సంతోషాలు, అంతులేని ఐశ్వర్యం వరంగా ఇస్తాడట. ఎందుకంటే తులసి మొక్కంటే విష్ణువుకు చాలా ప్రీతిపాత్రం. తులసి మొక్కకు పచ్చి పాలు పోయడం వల్ల అంతులేని ధన సంపదలు లభిస్తాయి. నిర్ణీత పద్ధతిలో ప్రతిరోజూ ఇలా చేస్తే ఇంట్లో ప్రతి ఇబ్బంది తొలగిపోవడమే కాకుండా..గురువారం నాడు ఇలా చేయడం కారణంగా కుండలిలో గురు గ్రహం బలోపేతమౌతుంది. 


ఒక చెంబు శుభ్రమైన నీళ్లలో పచ్చి పాలు డ్రాప్స్ కొన్ని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తులసి మొక్కకు అర్పించాలి. దీనివల్ల అమితమైన లాభాలు కలుగుతాయి. జలాభిషేకం చేసేటప్పుడు సమయం, దిశ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. 


Also read: Astro Tips: జాతకంలోని ఈ 3 గ్రహాలు మిమ్మిల్ని పేదవాడిగా మారుస్తాయి, పరిహారాలు తెలుసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook