Astro Tips: జాతకంలోని ఈ 3 గ్రహాలు మిమ్మిల్ని పేదవాడిగా మారుస్తాయి, పరిహారాలు తెలుసుకోండి..

Astro Tips: జాతకంలోని గ్రహాల చెడు దశ వ్యక్తిని పేదవాడిని చేస్తుంది. ఈ గ్రహాల వల్ల కలిగే నష్టాలు, పరిహారాలు గురించి తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2022, 01:03 PM IST
Astro Tips: జాతకంలోని ఈ 3 గ్రహాలు మిమ్మిల్ని పేదవాడిగా మారుస్తాయి, పరిహారాలు తెలుసుకోండి..

Astro Tips for Money: జాతకంలో గ్రహాలు క్షీణ దశలో ఉంటే ఆ వ్యక్తి యెుక్క ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. అతడు అప్పుల్లో కూరుకుపోతాడు. గ్రహాలు చెడు దశ కారణంగా ఇదంతా జరుగుతుంది. ఈ కింది మూడు గ్రహాలు వ్యక్తిని పేదవాడిగా మారుస్తాయి. అటువంటి గ్రహాలు గురించి తెలుసుకుందాం. 

రాహు గ్రహం (Rahu Planet)- ఆస్ట్రాలజీలో రాహు గ్రహాన్ని ఛాయా గ్రహంగా భావిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో రాహువు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తికి శుభ ఫలితాలు లభిస్తాయి. అశుభస్థానంలో ఉంటే మీకు చెడు ఫలితాలను ఇస్తుంది. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని నుంచి బయటపడటానికి 'ఓం రా రాహవే నమః ' అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించండి. 

శని (Saturn)- శనిగ్రహాన్ని క్రూరగ్రహంగా భావిస్తారు. శనివక్ర దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి జీవితం నాశనమవుతుంది. జాతకంలో శనిమహాదశ ఉన్నట్లయతే ఆ వ్యక్తి ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలను ఎదుర్కొంటాడు. ఆర్థిక స్థితి దిగజారుతుంది. వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయి. దీనికి పరిహారంగా శనివారం శనిదేవుడి ముందు ఆవ నూనె దీపం వెలిగించండి. శని దోష నివారణకు గుర్రపు డెక్క ఆకారపు ఉంగరాన్ని మధ్యవేలుకు ధరించండి. 

అంగారక గ్రహం (Mars)- దీనిని అగ్ని గ్రహంగా పరిగణిస్తారు. అంగారకుడిని గ్రహాల కమాండర్ అంటారు. అంగారకుడు ఆశుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కుజుడు ఆరు, అష్టమ, దశమ స్థానాలలో ఉన్నప్పుడు ధన నష్టం పెరుగుతుంది. ఆరో ఇంట్లో రుణభారం పెరుగుతుంది. మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. 

Also Read: Ganesh Chaturthi 2022: వినాయకుడిని ఇలా పూజిస్తే.. మీ ఇంట్లో సిరి సంపదలు పక్కా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News