2023 Sports Events:2023లో మరచిపోని అద్భుతమైన స్పోర్ట్స్
2023 Memorable Sports Event: 2023 సంవత్సరంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరిగాయి. చంద్రమండలం నుంచి క్రికెట్ వరకు భారత్ ప్రత్యేక గుర్తింపును చాటుకుంది. ఈ సంవత్సరం భారత్ క్రిడల్లో వీర విహారం చేసింది. ఈ 2023లో జరిగిన అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ అద్భుతమైన విజయాలు సాధించింది. అది ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
2023 Memorable Sports Event: 2023 సంవత్సరం మరి కొది క్షణాల్లో ముగియనుంది.. ఈ సంవత్సరం ఎన్నో అద్భుతమైన విశేషాలు జరిగాయి. రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాల వరకు మనం సాధించిన ఘనత గరించి చర్చిన దేశం అంటూ లేదు. రాకెట్ నుంచి క్రీడల వరకు ఈ సంవత్సరం ఉహించని విశేషాలు జరిగాయి. అయితే 2023 జరిగిన కొన్ని భారత క్రీడారంగంలో కీలక ఘట్టాల గురించి మనం తెలుసుకుందాం..
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ ఈ సంవత్సరం అద్భుతమైన విజయాలు సాధించింది. భారత్ తమకంటూ ఓ విశేషమైన గుర్తింపు స్థానాన్ని కైవశం చేసుకుంది. క్రికెట్ , చెస్, పారా అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్‌బాల్, బ్యాడింటన్, అథ్లెటిక్స్, ఇతర క్రీడల్లో మన ఆటగాళ్లు ఈ ఏడాది భారత్ పేరును యావత్ ప్రపంచం వినిపించేలా మోత మోగించారు.
ఈ సంవత్సరం సాధించిన అసాధారణమైన విజయాలు ఇవే...
✪ జావెలిన్ త్రో దిగ్గజ ఆటగాడు నీరజ్ చోప్రా ఈ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో స్వర్ణం పతకాన్ని సాధించాడు. ఆసియా క్రీడల చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం భారత్ 100 పతకాల మార్కును దాటి నాలుగో స్థానంలో నిలిచింది.
✪ 18 సంవత్సరాలకే ఫిడే చెస్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించాడు రమేష్‌బాబు ప్రజ్ఞానంద. అతి చిన్న వయసులో ప్రపంచకప్‌కు అర్హత సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
✪ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించిన తొలి భారత జోడీగా రికార్డు సాధించింది బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ షెట్టి.
✪ ఈ ఏడాది తొమ్మిదోసారి SAFF చాంపియన్‌లో కువైట్‌పై ఘన విజయం సాధించడంతో పాటు ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్-2కు అర్హత సాధించింది టీమిండియా ఫుట్‌బాల్ జట్టు.
✪ 2023లో టీమిండియా మెన్స్ క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వరల్డ్ నంబర్ వన్ జట్టుగా నిలిచింది.
✪ ఈసారి క్రికెట్‌లో మహిళలు సత్తా చాటుకున్నారు. భారత మహిళల అండర్ 19 జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలిచింది.
✪ వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్ వరకు అద్బుతంగా ఆడిన భారత్.. తుది మెట్టుపై కంగారూల చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది.
✪ ఆసియా పారా గేమ్స్ చరిత్రలో తొలిసారి వందకు పైగా పతకాలను భారత పారా అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. ఈ పోటీలో ఐదో స్థానంలో నిలిచింది.
✪ అతి చిన్న వయసులోనే అర్చరీలో వరల్డ్ టైటిల్‌ను సాధించింది అదితి స్వామి
✪ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలి స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ అరుదైన పతకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం.. పర్నీత్ కౌర్, అదితి స్వామితో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌ను గెలుచుకుంది.
Also Read: MS Dhoni-Pant: శాంతాక్లాజ్ దుస్తుల్లో మెరిసిన ధోనీ, పంత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook