MS Dhoni-Pant: శాంతాక్లాజ్ దుస్తుల్లో మెరిసిన ధోనీ, పంత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Christmas 2024: ఈ మధ్య ధోని ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, పండగ జరిగినా అక్కడ వాలిపోతున్నాడు టీమిండియా క్రికెటర్ పంత్. తాజాగా శాంతాక్లాజ్ దుస్తుల్లో ధోనీ, పంత్ సంద‌డి చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 12:24 PM IST
MS Dhoni-Pant: శాంతాక్లాజ్ దుస్తుల్లో మెరిసిన ధోనీ, పంత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

MS Dhoni-Rishabh Pant Christmas Celebrations: భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) క్రిస్మ‌స్ వేడుక‌లను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి దుబాయ్ లో జరుపుకున్నారు. ఈ క్రిస్మ‌స్ సంబురాల్లో ధోని భార్య సాక్షి సింగ్(Sakshi Singh), కూతురు జీవాతోపాటు టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్(Rishabh Pant) కూడా సందడి చేశాడు. ఈ సందర్భంగా ధోనీ, పంత్‌ శాంతాక్లాజ్ టోపీలు ధరించి క్రిస్మ‌స్ ట్రీ ముందు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్స్ ను మహి సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ధోనీ వార‌సుడిగా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంత్ తక్కువ సమయంలోనే కీపర్ అండ్ బ్యాటర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. జట్టులో ప్లేస్ సుస్థిరమవుతున్న సమయంలో ఊహించని విధంగా యాక్సిడెంట్‌కు గుర‌య్యాడు పంత్. ఈ డిసెంబరు 31 వస్తే ప్రమాదం జరిగి ఏడాది అవుతుంది. మోకాలి సర్జరీ కారణంగా పంత్ ఐపీఎల్, ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్ 2024లో జరిగే ఐపీఎల్ సీజన్ లో పాల్గొననున్నాడు. ఈసారి కూడా పంత్ ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) తరపున బరిలోకి దిగే అవకాశం ఉంది. 

మరోసారి చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)కు టైటిల్ అందించేందుకు రెడీ అవుతున్నాడు ధోని. ఇప్పటికే చెన్నైను ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ధోని, పంత్ చాలా దగ్గరయ్యారు. మాహి ఇంట్లో ఏ చిన్న ఫంక్ష‌న్ జ‌రిగినా పంత్ అక్కడ వాలిపోతున్నాడు. తాజాగా ధోనితో కలిసి క్రిస్మస్ సంబరాలు చేసుకున్నాడు ఈ డాషింగ్ బ్యాటర్.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni)

Also Read: Year Ender 2023: ఈ ఏడాది టీమిండియా బద్దలు కొట్టిన రికార్డులు ఇవే.. ఆ ఒక్కటి తప్ప..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News