IPL 2021 Auction: చెన్నై వేదికగా వేలానికి సిద్ధమవుతున్న బీసీసీఐ
IPL 2021 Auction: క్రికెటర్లు మరోసారి వేలానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఎవరు ఎంత పలుకుతారో చూడాలి. ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియడంతో కొత్త వేలం చెన్నై వేదికగా జరగనుంది.
IPL 2021 Auction: క్రికెటర్లు మరోసారి వేలానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఎవరు ఎంత పలుకుతారో చూడాలి. ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియడంతో కొత్త వేలం చెన్నై వేదికగా జరగనుంది.
ఐపీఎల్ ( IPL ) ప్రారంభంతో క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ లేని వేలం ప్రక్రియ మొదలైంది. ఒక్కో క్రికెటర్ అతని సామర్ధ్యాన్ని బట్టి అమ్ముడుపోతున్నాడు. ఒక్కో ఫ్రాంచైజీ ( Franchise ) సామర్ధ్యాన్ని బట్టి ఆటగాళ్ల కొనుగోలు జరుగుతోంది. ఐపీఎల్ ఆటగాళ్ల ( IPL Players ) రిటెన్షన్ గడువు జనవరి 20తో ముగిసిపోయింది. కొన్ని ఫ్రాంచైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. ఫిబ్రవరి 4వ తేదీ వరకూ ఏ ఆటగాళ్లను వదులుకునేది..ఎవరిని ఉంచుకునేది వివరాల్ని బీసీసీఐ ( BCCI ) కు అందించాల్సి ఉంది. ఈ వివరాల ప్రకారం మిగిలిన ఆటగాళ్ల కోసం వివిధ ఫ్రాంచైజీల మధ్య వేలం ఉంటుంది. ప్రస్తుతం ఆటగాళ్లు కొనుగోలు కోసం వివిధ ఫ్రాంచైజీల వద్ద 196 కోట్ల ధనముంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian premier league ) ప్రపంచంలో అత్యధిక ఆదరణ ఉన్న లీగ్ గా ప్రాచుర్యం పొందింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ( IPL 2021 Season ) సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త వేలం ప్రక్రియ ( Ipl 2021 Auction ) ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ జట్ల ( India vs England Test series ) మధ్య రెండు టెస్టులు చెన్నైలోని చిదంబరం స్డేడియంలో జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీన రెండు జట్లు చెన్నై ( Chennai ) కు చేరుకోనున్నాయి. బయో బబుల్ ( Bio Bubble ) పరిధిలోకి వెళ్లేముందు క్రికెటర్లందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 13 నుంచి రెండవ టెస్టు ప్రారంభమవుతుంది.
Also read: IPL 2021: అత్యధికంగా ఆర్జించిన భారత క్రికెటర్లు వీరే..
https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook