India vs England Highlights: ముంబైలోని వాంఖడే స్టేడియం గురువారం రాత్రి బౌండరీల వర్షంతో తడిసి ముద్దయింది. భారత్, ఇంగ్లాండ్ జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడడంతో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 246 పరుగులకు పరిమితం అయింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 499 పరుగులు చేశాయి. టీమిండియా విజయానికి కారణమైన ఐదుగురు ప్లేయర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
IND vs ENG 5th Test: ఇంగ్లీష్ జట్టుతో ఉత్కంఠభరితంగా సాగిన 5వ టెస్టులో టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్ ను 2-2తో ముగించేసింది. 374 పరుగుల లక్ష్య ఛేధనలో ఓవర్ నైట్ స్కోరుతో 339/6తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. జేమీ స్మీత్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ లను భారత బౌలర్లకు వెంటవెంటనే పంపించేశారు. అట్కిన్సన్ చివరి వికెట్ గా వెనుదిరిగాడు. సిరాజ్ 5 ప్రసిద్ధ్ క్రిష్ణ 4, ఆకాశ్ దీప్ 1 వికెట్ చొప్పున పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224, ఇంగ్లండ్ 247 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 396 పరుగులు చేసింది.
IND vs ENG : ఇంగ్లండ్ తో 2025లో ఓవల్ లో జరిగిన 5వ టెస్టు మ్యాచులో భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ తన ప్రవర్తనతో వివాదంలో చిక్కాడు. ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ ను ఔట్ చేసిన తర్వాత ఆకాశ్ దీప్ అతని భుజంపై చేయి వేసి..ఎగతాళి చేసిన ఘటన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కు కోపం తెచ్చేలా చేసింది. ఈ ఘటనపై పాంటింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆకాశ్ దీప్ ప్రవర్తన సరైంది కాదంటూ ఫైర్ అయ్యాడు.
Ind Vs Eng 5th Test: ఇంగ్లండ్, టీమ్ఇండియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్లు అద్భుతం చేశారు. భారత పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో నాలుగు వికెట్లు పడగొట్టి.. ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించారు. వీరిద్దరూ చెలరేగిన నేపథ్యంలో ఇంగ్లీష్ జట్టు 247 పరుగులకు ఆలౌటైంది.
India Vs England Playing 11 For 5th Test: భారత్‌లో ఐదో టెస్ట్‌కు ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం నొప్పితో ఈ మ్యాచ్‌కు దూరమయ్యారని ఈసీబీ ప్రకటించింది. మరో ముగ్గురు ప్లేయర్లు కూడా తుది జట్టులో స్థానం కోల్పోయారు.
Indian Probable Playing XI for 5th Test: మాంచెస్టర్ టెస్ట్‌ను డ్రా చేసుకోవడం ద్వారా సిరీస్‌ను కాపాడుకోవాలనే ఆశను భారత్ సజీవంగా ఉంచుకుంది. కానీ ఇప్పటికీ 1-2తో వెనుకబడి ఉంది. ఓవల్ టెస్ట్‌కు ముందు పంత్-బుమ్రా లేకపోవడం, పేలవమైన ఫామ్‌తో జట్టు ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో చివరి టెస్ట్‌లో భారత ప్లేయింగ్ XIలో కనీసం నాలుగు మార్పులు జరిగే అవకాశం ఉంది.
IND VS ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన 4వ టెస్ట్ డ్రాగా ముగిసింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు చేసి భారత్ ను గండంలో నుంచి గట్టెక్కించారు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ కూడా సెంచరీ చేశాడు. కేఎల్ రాహుల్ సెంచరీ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 358 పరుగులు చేయగా ఇంగ్లండ్ 669 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
Shubman Gill: టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ తొలి సిరీస్ లోనే రికార్డులు బద్దలు కొడుతున్నారు. బర్మింగ్ హమ్ లో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలతో అదరగొట్టిన ప్రిన్స్..ఇప్పుడు రికార్డును నెలకొల్పాడు.
Karun Nair Crying: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్ననాలుగో టెస్టులో కరుణ్ నాయర్తప్పించడం సహా అతడి స్థానంలో సాయి సుదర్శన్‌కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. అయితే తాజాగా కరుణ్ నాయర్ ఏడుస్తున్న ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
Jofra Archer clean bowled Rishabh Pant: 4వ టెస్ట్‌లో జోఫ్రా ఆర్చర్ భారత తొలి ఇన్నింగ్స్‌లో లోయర్ ఆర్డర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌లను తిరిగి పెవిలియన్‌కు పంపాడు. కాలుగాయంతో బాధపడుతున్నప్పటికీ రిషభ్ పంత్ ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. కానీ చివరికి ఆర్చర్ వేసిన బంతికి బౌల్డ్ అయ్యాడు. వికెట్ తీసిన సంబురంలో ఆర్చర్ కాలితో వికెట్ ను తన్నిన వీడియో వైరల్ అయ్యింది.
India Vs England 4th Test Updates: మాంచెస్టర్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అనూహ్యంగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.
IND vs ENG 4th Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ జులై 23వ తేదీ నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డులో ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాలుగో టెస్టులో భారత్ ఏకంగా ముగ్గురు వికెట్ కీపర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్ ఎందుకు ఈ వింత నిర్ణయం తీసుకున్నాడనేది తెలుసుకుందాం.
Mohammed Siraj Heart Breaking Moment: మహ్మద్ సిరాజ్ వికెట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బషీర్ బౌలింగ్‌లో సిరాజ్ డిఫెన్స్ ఆడినా.. బంతి వెనక్కి వెళ్లి బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో సిరాజ్ మియా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు.
IND Vs ENG Test : ఇంగ్లండ్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఉత్కంఠ భరితంగా సాగిన 3వ టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 22 పరుగుల తేడాతో భారత్ పై ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియా గెలవడానికి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దీనికి ప్రతిస్పందనగా భారత జట్టు 170 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
IND vs ENG: టీమిండియా పేస్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై కెప్టెన్ శుభ్ మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. 5 టెస్టుల అండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న 3వ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో అద్బుతంగా రాణించాడు. తన తొలి ఓవర్ లోనే ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్ , జాక్ క్రాలీలను పెవిలియన్ కు పంపాడు. ఔట్ సిలబస్ లా వచ్చి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు.
India Breaks The Birmingham Jinx 58 Records Against England 2nd Test: ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు భారీ విజయాన్ని అందుకుని సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ఈ విజయంతో 58 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. రెండో టెస్ట్ ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
Team india 1000+ Test Runs: బచ్చగాడు వీడితో ఏం అవుతుందన్నారు...ఏం అవుతుందో చేసి చూపిస్తున్నాడు శుభ్ మన్ గిల్. గంగూలీ, విరాట్ కోహ్లీ వంటి యోధానుయోధులు సాధించలేని రికార్డులను గిల్ టీమ్ చేసి సాధించి చూపిస్తోంది. శుభ్ మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్..టీమిండియా టెస్టు హిస్టరీలోనే తొలిసారిగా 1000 పరుగులకు పైగా సాధించింది. గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 587 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో6 వికెట్లు కోల్పోయి 427 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.
IND vs ENG: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. తన పదునైన బౌలింగ్ తో 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ కు తెరదించాడు ఈ భారత పేసర్. మూడో రోజు ఆటలో సిరాజ్ విజ్రుంభించడంతో ఇంగ్లండ్ జట్టు 407 పరుగులకు అలౌట్ అయ్యింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 180 పరుగుల కీలక ఆధిక్యం లభించినట్లయ్యింది.
Shubman Gill's 12 records: భారత్,ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో శుభ్‌మాన్ గిల్ 269 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సర్లు బాది భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల బలమైన స్కోరు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో కలిసి రెండు పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మొత్తం 12 రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.
India Vs England Playing 11: తొలి టెస్ట్‌లో అనూహ్యంగా ఓటమిపాలైన భారత్.. రెండో టెస్ట్‌లో విజయం సాధించి పుంజుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లకు తుది జట్టులో మార్పులు చేయాలని భావిస్తోంది. ఎవరు ప్లేయింగ్ 11లో ఉంటారు..? బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడతాడా..?
IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. ఇప్పటివరకు టీం ఇండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.జూలై 2 నుండి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న రెండవ మ్యాచ్‌కు భారత జట్టు రెడీ అవుతోంది. అయితే ఈ రెండవ టెస్టులో శుభ్‌మాన్ గిల్‌కు చక్కటి అవకాశం ఉంది. ఒకవేళ అదే గనుక జరిగినట్లయితే.. అతని పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.
IND vs ENG: భారత జట్టు ఘోర పరాజయానికి కారణాలెన్నో ఉన్నాయి. ఒక్కడు మాత్రం జట్టును కంపు చేయడానికే వచ్చాడు. అతను జట్టులో ఉన్నంత కాలం భారత జట్టుకు కష్టాలు తప్పవు.