Asia Cup 2021 Cancel: కరోనా ఎఫెక్ట్, ఆసియా కప్ రద్దు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డ్
Asia Cup 2021 cancelled due to COVID-19 | భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా దేశాల మధ్య ఆసియా కప్ టీ20 టోర్నీ నిర్వహించాల్సి ఉంది. కానీ గత ఏడాది నుంచి కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో పలు టోర్నీల తరహాలోనే ఈ మెగా ఈవెంట్ రద్దు చేశారు.
కరోనా మహమ్మారి దెబ్బకు ఇదివరకే పలు కీలక టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి. కొన్ని సిరీస్‌లు రద్దయ్యాయి. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సైతం కరోనా వైరస్ కేసులు రావడంతో నిరవదిక వాయిదా పడింది. తిరిగి ప్రారంభమవుతుందని అభిమానులకు నమ్మకం కూడా లేదు. విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ 2021 తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యమేనని తెలుస్తోంది.
కరోనా వైరస్ కారణంగా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ రద్దయింది. జూన్ నెలలో శ్రీలంక నిర్వహించాని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ చేసింది. అయితే కరోనా కేసుల నేపథ్యంలో ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించలేకపోతున్నామని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్లే డిసిల్వా ప్రకటించారు. సెప్టెంబర్‌లో నిర్వహించాలనుకున్న ఆసియా కప్ 2020 టోర్నమెంట్‌ను జూన్ 2021కి వాయిదా వేశారు. కానీ కోవిడ్19 తీవ్రత భారత్ (Team India), శ్రీలంక, ఇతర ఆసియా దేశాలలో అధికం ఉండటంతో ట్రోఫీని రద్దు చేయడమే సరైన నిర్ణయంగా భావించారు.
Also Read: Ashes Series Schedule: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన ఈసీబీ
భారత్, పాకిస్తాన్ (Pakistan), ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు మలేషియా దేశాల మధ్య ఆసియా కప్ టీ20 టోర్నీ నిర్వహించాల్సి ఉంది. కానీ గత ఏడాది నుంచి కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో పలు టోర్నీల తరహాలోనే ఈ మెగా ఈవెంట్ రద్దు చేశారు. అక్టోబర్ - నవంబర్ నెలలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహించడంపై సైతం నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో లంక ప్రభుత్వం 10 రోజులపాటు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది.
Also Read: Virat Kohli వికెట్ తీయడంపై న్యూజిలాండ్ పేసర్ Tim Southeeని ప్రశ్నించిన అభిమాని
చివరగా 2018లో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (UAE) వేదికగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహించారు. ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి 3 వికెట్లు తేడాతో ఆసియా కప్ 2018ని టీమిండియా కైవసం చేసుకోవడం తెలిసిందే. గత రెండేళ్లుగా పలు టోర్నీలకు కోవిడ్19 కేసులు అంతరాయం కలిగిస్తున్నాయి. ప్రపంచంలో పలు దేశాలు కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తున్న క్రమంలో బ్లాక్ ఫంగస్ సమస్య పుట్టుకొచ్చి మరో ఆందోళనకు తెరతీసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook