IND Vs SA Series 2021 Schedule: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఇండియా Vs సౌతాఫ్రికా సిరీస్ షెడ్యూల్ లో మార్పు
IND Vs SA Series 2021 Schedule: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. డిసెంబరు 17 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ద్వైపాక్షిక సిరీస్ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఈ సిరీస్ లో భాగంగా.. డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
IND Vs SA Series 2021 Schedule: ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా ఆడనున్న షెడ్యూల్ లో మార్పు జరిగింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు వెల్లడించింది.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా.. టీమ్ఇండియా, సౌతాఫ్రికా జట్టు మధ్య మూడు టెస్టులు, మూడు వన్డేలు జరగాల్సి ఉంది. ఈనెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన టెస్టులు 26 నుంచి.. జనవరి 11 నుంచి జరగనున్న వన్డే సిరీస్ 19వ తేదీ నుంచి జరగనున్నట్లు వెల్లడించింది.
దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తో సంప్రదింపులు జరిపిన అనంతరం క్రికెట్ సౌతాఫ్రికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది. తొలుత మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు జరగాల్సి ఉండగా కొవిడ్ నేపథ్యంలో టీ20 సిరీస్ వాయిదా పడింది.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా సిరీస్ కొత్త షెడ్యూల్..
టెస్టు సిరీస్:
- తొలి టెస్టు- డిసెంబరు 26-30 - సెంచూరియన్
- రెండో టెస్టు - జనవరి 3-7 - జోహన్నెస్‌బర్గ్
- మూడో టెస్టు - జనవరి 11-15 - కేప్‌టౌన్
వన్డే సిరీస్:
- మొదటి వన్డే - జనవరి 19 - పార్ల్
- రెండో వన్డే - జనవరి 21 - పార్ల్
- మూడో వన్డే - జనవరి 23 - కేప్‌టౌన్
Also Read: IND vs NZ: వావ్.. భారత్-న్యూజీలాండ్ ఆటగాళ్ల పేర్లు భలే కలిసాయే! అశ్విన్ నువ్ సూపరో సూపర్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook