క్రికెట్ ( Cricket ) గతిని..వేగాన్ని మార్చింది ట్వంటీ ట్వంటీ ఫార్మెట్ ( Twenty20 Format ) . క్రికెట్ ప్రేమికుల సంఖ్యను కూడా ఈ ఫార్మాట్ పెంచేసింది. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చి ఆదరణ పెరుగుతున్న టీ10 టోర్నమెంట్ ( T10 Tournament ) తేదీలు ఖరారయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ ( IPL Season 13 ) లీగ్ సీజన్ 13 పోరు రసవత్తరంగా సాగుతోంది. షార్జా, అబూదాబి, దుబాయ్ వేదికలుగా ఈ పోటీలు సాగుతున్నాయి. ట్వంటీ ట్వంటీ ఫార్మాట్  క్రికెట్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. క్రికెట్ గేమ్ గతిని, వేగాన్ని ఈ ఫార్మాట్ మార్చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. బహుశా అందుకే ఇప్పుడు టీ10 ఫార్మెట్ రంగంలో వచ్చింది. క్రికెట్ ఆటకు మరింత వన్నె తీసుకురావడానికి. ఎందుకంటే 2019లో నిర్వహించిన టీ10 ఆరంభ సీజన్ కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ స్పందనను దృష్టిలో పెట్టుకుని టీ10 రెండో సీజన్ ను నిర్వహించనున్నారు.


ఐపీఎల్ 2020 ( IPL 2020 ) జరుగుతున్న యూఏఈ వేదికపైనే టీ10 టోర్నమెంట్ కూడా జరగనుంది. వచ్చే యేడాది ప్రారంభంలో అంటే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకూ టీ10 లీగ్ పోటీలు జరగనున్నాయి. టీ10 తొలి సీజన్ ను టీవీల ద్వారా దాదాపు 80 మిలియన్ల మంది వీక్షించారు. కరోనా సంక్రమణ నేపధ్యంలో లీగ్ ప్రారంభానికి ముందే ఆటగాళ్లను యూఏఈకు రప్పించాలనేది ఆలోచన. టీ10 టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసార హక్కుల్ని సోనీ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. టీ10 లీగ్ నిర్వహణను బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. Also read: IPL 2020: హైదరాబాద్ వర్సెస్ పంజాబ్..ఎవరి బలమెంత?