ఐపీఎల్ 2020 ( IPL 2020 ) లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad versus Kings eleven punjab ) వర్సెస్ కింగ్స్ లెవన్ పంజాబ్ జట్లు పోటీ పడనున్నాయి. ఎవరి బలమెంతుందో ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13 ( Indian premier league season 13 ) లో ఇవాళ పోరు రసవత్తరం కానుంది. డేవిడ్ వార్నర్ సేనతో రాహుల్ టీమ్ ఢీ కొట్టనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించి పట్టు సాధించడానికి డేవిడ్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లలో పరాజయం పొందిన సన్ రైజర్స్ జట్టుకు ఈ పోరులో విజయం అనివార్యంగా మారింది.
ప్రారంభంలో రెండు మ్యాచ్ లలో పరాజయం పొందిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అనంతరం రెండు విజయాలు సాధించి గాడిలో పడింది. అంతలోనే ముంబై ఇండియన్స్ జట్టు ( Mumbai indians team ) చేతిలో పరాజయంతో భంగపడింది. అందుకే ఇప్పుడు కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టుతో జరగనున్న పోటీలో విజయం కోసం సర్వం ఒడ్డడానికి సిద్ధమవుతోంది. ఇక కింగ్స్ లెవన్ జట్టుకు ఈ పోరు జీవన్మరణ సమస్యతో సమానం. ఎందుకంటే ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది కింగ్స్ లెవన్ జట్టు.
సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా దూరం కావడం హైదరాబాద్ జట్టుకు ఎదురుదెబ్బే. బ్యాటింగ్ విషయంలో జట్టు పటిష్టంగానే ఉన్నా..బౌలింగ్ కాస్త ఇబ్బంది పెడుతోంది జట్టును. ప్రారంభ ఓవర్లు, చివరి ఓవర్లను కట్టుదిట్టం చేయగలిగితే డేవిడ్ సేనకు విజయం సులభమవుతుంది.
వరుసగా విఫలమవుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు బదులుగా హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. యువ స్పిన్నర్ ముజీబ్ రెహమాన్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇక ప్రధానంగా పంజాబ్ జట్టు ఒత్తిడిని తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. బౌలింగ్ వైఫల్యం పంజాబ్ ప్రధాన సమస్యగా మారింది. బౌలింగ్ విభాగంలో వైఫల్యంతో ఆ జట్టుకు ఓటమి ఎదురవుతోంది. Also read: Vernon Philander: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఇంట్లో విషాదం