జ్వాల గుత్తా పెళ్లి ( Gutta Jwala marriage ) చేసుకోబోతోంది. త‌మిళ హీరో విష్ణు విశాల్‌తో ( Vishnu Vishal ) గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న గుత్తా జ్వాల అతడితో జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమైంది. త‌న భార్య ర‌జనీకి రెండేళ్ల క్రితం విడాకులు ఇచ్చిన విష్ణు విశాల్.. అప్పటి నుంచే బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల‌తో డేటింగ్ ( Vishnu Vishal dating Gutta Jwala ) చేస్తున్నాడు. ఇప్పటివరకు పలు సందర్భాల్లో వీళ్లిద్దరూ సరదాగా కలిసి షికార్లు చేస్తున్న ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అని నెటిజెన్స్ సైతం ఓ నిర్ణయానికొచ్చేశారు. నెటిజెన్స్ భావించినట్టుగానే సెప్టెంబర్ 7న గుత్తా జ్వాల పుట్టిన రోజు సందర్భంగా విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇద్దరూ రింగ్ మార్చుకుని ఎంగేజ్‌మెంట్ తంతు పూర్తి చేసుకున్నారు. Also read : 10th class students: 10వ తరగతి వాట్సాప్ గ్రూపులో బూతు వీడియోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా గుత్తా జ్వాలాతో కలిసి తీసుకున్న ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేసిన విష్ణు విశాల్.. ఆమెకు హ్యాపీ బ‌ర్త్ డే అని విష్ చేయడంతో పాటు జీవితాన్ని మళ్లీ కొత్త ఆరంభిస్తున్నట్టు అందులో పేర్కొన్నాడు. ఒకరిపట్ల ఒకరం సానుకూలంగా ఉందాం. మ‌న ఫ్యామిలీతో పాటు మన అనుకునే వాళ్లందరి ఉన్నతికి పాటుపడదాం. కొత్త ఆరంభానికి మీ అంద‌రి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి అని ఆ ట్వీట్‌లో పేర్కొన్న విష్ణు.. అర్ద‌రాత్రి స‌మయంలోనూ ఉంగరం ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల మేనేజ‌ర్ బసంత్ జైన్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. Also read : Gangavva in BB4: బిగ్ బాస్ రియాలిటీ షోలో గంగవ్వ డైలాగ్స్ కెవ్వు కేక

2001లో రజినీని పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్‌.. రెండేళ్ల క్రితమే ఆమెకు విడాకులు ఇచ్చాడు ( Vishnu Vishal's first wife Rajini ). ఇక 2005లో బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ చేత‌న్ ఆనంద్‌ని పెళ్లి చేసుకున్న గుత్తా జ్వాల ( Gutta Jwala's ex-husband Chetan Anand ).. 2011లో చేతన్‌కి విడాకులు ఇచ్చి ఆ వివాహాన్ని రద్దు చేసుకుంది. Also read : Vakeel Saab on OTT: ఓటీటీలో వకీల్ సాబ్ ?


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR