Sitara: ప్రిన్స్ కూతురు సితారా వినాయకుడి శ్లోకం ఎంత బాగా పాడిందో..

ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ) నమ్రతా తమ కుటుంబంలోని చిన్ని చిన్ని సంతోషాలను ఫ్యాన్స్ తో షేర్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. 

Last Updated : Sep 7, 2020, 11:22 PM IST
    • ప్రిన్స్ మహేష్ బాబు నమ్రతా తమ కుటుంబంలోని చిన్ని చిన్ని సంతోషాలను ఫ్యాన్స్ తో షేర్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.
    • ఫ్యాన్స్ కూడా వారు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు చూసి సంతోషడుతుంటారు.
Sitara: ప్రిన్స్ కూతురు సితారా వినాయకుడి శ్లోకం ఎంత బాగా పాడిందో..

ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ) నమ్రతా తమ కుటుంబంలోని చిన్ని చిన్ని సంతోషాలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఫ్యాన్స్ కూడా వారు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ( Viral Video) చూసి సంతోషడుతుంటారు. తాజాగా అలాంటిదే ఒక పాత వీడియో సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ కుమార్తె సితార ( Sitara ) వినాయకుడి శ్లోకం పాడుతుంది. 

మహారాష్ట్రలో ఎక్కువగా ఆ పాటను వినాయకుడి హారతి (aarati ) సమయంలో పాడుతుంటారు. జయదేవ జయదేవ అంటూ సాగే ఈ శ్లోకాన్ని మహేష్ సతీమని నమ్రత... సితారకు నేర్పించింది అనేది మాత్రం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. మీరు కూడా వినండి.

సితారా ఈ పాటను పాడుతున్న సమయంలో మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పుస్తకం చదువుతూ కనిపించాడు. సితారా శ్లోకం పాడటాన్ని వింటూనే మధ్యమధ్యలో కెమెరావైపు చూస్తూ కనిపించాడు గౌతం. ఈ వీడియో పాతది అని తెలుస్తోంది. అయినా కానీ అభిమానులను అలరిస్తోంది.

 

Trending News