వివాదాలకు చెక్ పెడుతూ ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఎంపిక చేశారు. గాయం విషయం తెలుసుకోకుండా హిట్ మ్యాన్‌కు సమాచారం ఇవ్వకుండానే ఆసీస్ టూర్‌కు జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. అయితే ఐపీఎల్ 2020లో రోహిత్ (Rohit Sharma) మళ్లీ క్రీజులోకి దిగడంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన సెలెక్టర్లు ఆసీస్ పర్యటనలో రోహిత్ శర్మను భాగస్వామిని చేశారు. అయితే కేవలం టెస్టులకు మాత్రమే రోహిత్‌కు అవకాశం ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shikhar Dhawan: మళ్లీ మరిచిపోయావా అంటూ యువరాజ్ సింగ్ ట్రోలింగ్


 


వన్డేలు, టీ20 జట్లకు రోహిత్‌ను ఎంపిక చేయలేదు. విశ్రాంతి ఇస్తున్నట్లు నిర్ణయించుకున్నామని సెలక్టర్లు చెబుతున్నారు. భారత జట్టు నవంబర్ 27 నుంచి మూడు వన్డేలు, 3 టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లు జరగనున్నాయి. తొడ కండరాల గాయంతో ఐపీఎల్‌లో కొన్ని రోజులపాటు ముంబై జట్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ గాయం గురించి వివరాలు తెలుసుకోకుండానే టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు జట్లను సెలెక్టర్లు ప్రకటించడం తెలిసిందే. రోహిత్‌ను ఏ ఫార్మాట్‌లోనూ ఎంపిక చేయని సెలెక్టర్లు తాజాగా హిట్ మ్యాన్ ఐపీఎల్ 2020 ఆడుతూ ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో కేవలం టెస్టు సిరీస్‌కు ఓపెనర్ రోహిత్‌ను ఎంపిక చేశారు.


IPL 2020: హైదరాబాద్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ


 


రోహిత్ శర్మ సిద్ధంగా లేడు.. అతడు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. మైదానంలోకి దిగలేడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన రోజు వ్యవధిలో రోహిత్ శర్మ బ్యాట్ చేతపట్టి నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం వివాదాలకు ఆజ్యం పోసింది. దీంతో చేసిన పొరపాటు సరిదిద్దుకోవడంలో భాగంగా ఒక్క ఫార్మాట్‌కు రోహిత్‌ను తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగానే రోహిత్ శర్మను ఎంపిక చేయలేదనే వాదనలు సైతం తెరపైకి వచ్చాయి. గతేడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత వీరిద్దరూ మునుపటిలా ఉండటం లేదు. ఐపీఎల్‌లో టాస్ సమయంలోనూ ఇది స్పష్టంగా కనిపించింది.


IPL 2020 Final: ఎంఎస్ ధోనీ ఉంటే రోహిత్‌‌దే విజయం.. కానీ ఈ ఫైనల్ సంగతేంటి!


 


Ind vs Aus 2020-21 Test Series Schedule:


1. తొలి టెస్టు మ్యాచ్ డిసెంబరు 17 నుంచి ప్రారంభం- అడిలైడ్ ఓవల్
2. రెండో టెస్టు మ్యాచ్ డిసెంబరు 26 నుంచి ప్రారంభం- మెల్‌బోర్న్ వేదిక
3. మూడో టెస్టు మ్యాచ్ జనవరి 7 నుంచి ప్రారంభం - సిడ్నీ వేదిక
4. నాలుగో టెస్టు మ్యాచ్ జనవరి 15 నుంచి ప్రారంభం-  గబ్బా స్టేడియం


DC vs MI Match IPL 2020: ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండోసారి.. ఢిల్లీ చెత్త రికార్డు!  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe