Rohit Sharma named Team India's Test captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్​గా రోహిత్​ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్‌ను సుదీర్ఘ ఫార్మాట్ సారథిగా ఎంపిక చేస్తునట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ శ‌నివారం ప్రకటించారు. దాంతో ఇకనుంచి పూర్తి స్ధాయిలో రోహిత్‌ భారత టెస్ట్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. బీసీసీఐ తాజా నిర్ణయంతో మూడు ఫార్మాట్ల‌లోనూ భారత జట్టుకు రోహిత్ శ‌ర్మ సార‌ధ్యం వ‌హించ‌నున్నాడు. బీసీసీఐ ముందునుంచి మూడు ఫార్మాట్ల‌కు ఒకరే కెప్టెన్ ఉండాలని చెపుతున్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విండీస్ పర్యటన అనంతరం స్వదేశంలో శ్రీ‌లంక‌తో జ‌రిగే మూడు మ్యాచుల టీ20 సిరీస్‌, రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు భారత జ‌ట్టును ఎంపిక చేసిన‌ట్లు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ తెలిపారు. ఇందులో భాగంగానే టెస్ట్ కెప్టెన్​గా రోహిత్​ శర్మను ఎంపిక చేశారు. వైస్‌ కెప్టెన్‌గా పేసర్ జస్ప్రీత్ బూమ్రా నియమితుడయ్యాడు. ఇక శ్రీ‌లంక‌తో పొట్టి సిరీస్‌కు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ వికెట్ కీపర్ రిష‌బ్‌ పంత్‌ల‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.


గత కొంతకాలంగా ఫామ్​ లేమితో ఇబ్బందిపడుతున్న టెస్ట్ స్పెసలిస్ట్ ఆటగాళ్లు అజింక్య రహానే, చేటేశ్వర పుజారాలను బీసీసీఐ జట్టు నుంచి తప్పించింది. రంజీ మ్యాచ్​లు ఆడి తిరిగి ఫామ్​లోకి రావాలని ఈ ఇద్దరికీ ఇటీవల బీసీసీఐ సూచించిన విషయం తెలిసిందే. రహానే, పుజారాతో పాటు ఓపెనర్ కేఎల్​ రాహుల్, స్పిన్ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్​ సుందర్, పేస్ ఆల్‌రౌండర్‌ శార్దూల్​ ఠాకూర్​లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. జయంత్​ ఠాకుర్​, సౌరభ్​ కుమార్, ప్రియాంక్​ పంచల్ లాంటి ప్లేయర్స్ జట్టులోకి వచ్చారు. 


ఇటీవల దక్షిణాఫ్రికాతో​ టెస్ట్‌ సిరీస్‌లో ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ టెస్ట్‌ కెప్టెన్సీని వదిలేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తదుపరి టెస్ట్‌ కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారని అంతా ఆసక్తిగా చుశారు. రోహిత్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ చివరికి బీసీసీఐ రోహిత్ వైపే మొగ్గుచూపింది. దాంతో రోహిత్‌ భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌ వ్యవహరించనున్నాడు. గత ఏడాది టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోగా.. రోహిత్‌ జట్టు బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.


భారత జట్లు:
టెస్టు: రోహిత్​ శర్మ (కెప్టెన్), మయాంక్​ అగర్వాల్​, ప్రియాంక్​ పంచల్, విరాట్​ కోహ్లీ, శ్రేయస్​ అయ్యర్​, హనుమా విహారి, శుభమన్​ గిల్, రిషబ్​ పంత్, కేఎల్​ భరత్, రవిచంద్రన్​ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్​ ఠాకుర్​, కుల్దీప్​ యాదవ్​, జస్ప్రీత్ బూమ్రా (వైస్​ కెప్టెన్), మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, ఉమేశ్​ యాదవ్, సౌరభ్​ కుమార్.


టీ20: రోహిత్​ శర్మ (కెప్టెన్), రుతురాజ్​ గైక్వాడ్​, ఇషాన్​ కిషన్, సూర్యకుమార్​ యాదవ్, శ్రేయస్​ అయ్యర్​, వెంకటేశ్​ అయ్యర్​, దీపక్​ హూడా, జస్ప్రీత్ బూమ్రా (వైస్​ కెప్టెన్)​, భువనేశ్వర్​ కుమార్, హర్షల్​ పటేల్, మహమ్మద్​ సిరాజ్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రవీంద్ర జడేజా, కుల్దీప్​ యాదవ్, రవి భిష్ణోయ్, ఆవేశ్​ ఖాన్. 


Also Read: IPL 2022: ఐపీఎల్​ 2022 కోసం ఆరు వేదికలు ఫిక్స్​- ఫైనల్స్ నరేంద్ర మోదీ స్టేడియంలో!


Also Read: Prabhas Amitabh: కల నిజమైందంటూ ఎమోషనల్‌ అయిన ప్రభాస్‌!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook