IND vs WI 2nd ODI: రాహుల్ ఇన్.. యువ ఓపెనర్‌కు నిరాశే! విండీస్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!!
IND vs WI 2nd ODI Playing XI: అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేకు దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు.
India Playing XI for 2nd ODI vs West Indies: స్వదేశంలో విండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్ మరో సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. నయా కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన చారిత్రక 1000 వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తొలి వన్డేలో ఓడిన కరేబియన్ జట్టు.. రెండో వన్డేలో గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
సోదరి వివాహం కారణంగా తొలి వన్డేకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. దాంతో మొదటి వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన యువ ఆటగాడు ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఇద్దరు మంచి ఆరంభం ఇస్తే భారత్‌కు తిరుగుండదు. ఫస్ట్ డౌన్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు దిగనున్నారు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ రానున్నాడు.
యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కరోనా బారిన పడటంతో తుది జట్టులోకి వచ్చిన దీపక్ హుడా.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. సూర్యతో కలిసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు కాబట్టి అతడి స్థానానికి డోకా లేదు. ఈ జంట చెలరేగితే భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం. తొలి వన్డేలో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన స్పిన్ మాయాజాలంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చాలా రోజుల తర్వాత నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా సత్తా చాటాడు. రెండో వన్డేలో కూడా ఈ ఇద్దరే బరిలోకి దిగనున్నారు. దాంతో మరో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మరోసారి నిరాశే ఎదురు కానుంది.
దక్షిణాఫ్రికా పర్యటనలో బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తాచాటిన దీపక్ చహర్‌కు మొదటి వన్డేలో ఆడే అవకాశం రాలేదు. అతని స్థానంలో ఆడిన ప్రసిధ్ కృష్ణ రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దాంతో రెండో వన్డేలో ఈ జంటపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక శార్దూల్ ఠాకూర్ పొదుపుగానే బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం తీయలేదు. ఒకవేళ చహర్‌ను ఆడించాలనుకుంటే మాత్రం శార్దూల్ బెంచ్‌కు పరిమితమవుతాడు.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుంధర్, దీపక్ చహర్/ శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.
Also Read: Horoscope Today 9th FEB 2022: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook