Horoscope Today 9th FEB 2022: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం!

Horoscope Today 9th FEB 2022: ఈ రోజు కొన్ని రాశుల వారికి అనేక విషయాల్లో కలిసి వస్తుంది. మకర రాశి వారికి సంపద పెరుగుతుంది. మరోవైపు మీన రాశి వారు తమ చిరకాల మిత్రులను కలిసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి గల వ్యక్తులకు చదువుపై ఆసక్తి ఉండదు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 06:56 AM IST
    • 2022 ఫిబ్రవరి 9 (బుధవారం).. రాశి ఫలాలు
    • మిథున రాశి వారు ప్రమోషన్స్ పొందవచ్చు
    • కుంభరాశి వారు గుడ్ న్యూస్ వింటారు
Horoscope Today 9th FEB 2022: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం!

Horoscope Today 9th FEB 2022: బుధవారం (ఫిబ్రవరి 9) అనేక రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహ రాశి వారికి పనిలో మంచి డబ్బు లభిస్తుంది. మరోవైపు, తులా రాశి ఉన్న విద్యార్థులు పరీక్షలు మొదలైన వాటిలో విజయం సాధించబోతున్నారు.

మేషరాశి (Aries) 

ఈ రాశి కలిగిన వివిధ రంగాల వారు నేడు చేపట్టే అనేక కార్యక్రమాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. సరైన పనులకు డబ్బును ఖర్చు చేస్తారు. విద్యార్థులు పరీక్షలలో బాగా రాణిస్తారు, కానీ వారి మనస్సులో భయం ఉంటుంది. రుణాలు ఇవ్వడం మానుకోండి. 

వృషభ రాశి (Taurus)

ఈ రాశి కలిగిన వారికి ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉంది. దీని వల్ల రోజంతా ఆందోళనలో ఉంటారు. ఏదైనా పనుల్లో మరోకరి మద్దతు మీకు లభిస్తుంది. దీనితో పాటు, మీరు తెలివిని ఉపయోగించి ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మీరు మీ కోరిక మేరకు మీ పని ప్రణాళికలను పూర్తి చేస్తారు.

మిథున రాశి (GEMINI)

ఈ రోజు మిథున రాశి వారికి చాలా ఆనందంగా ప్రారంభం కానుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగంలో మంచి ధనలాభం ఉంటుంది. ప్రమోషన్ సూచనలు ఉన్నాయి. ఇదే సమయంలో వ్యాపారులకు లాభాలు పొందే అవకాశం ఉంది.

కర్కాటక రాశి (Cancer) 

ఈ బుధవారం మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఏ రంగంలోనైనా లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. మీ కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమం చేసే అవకాశం రావొచ్చు. అలాగే, ఈ రోజంతా మీకు సరదాగా గడిచిపోతుంది.

సింహ రాశి (LEO)

ఈ రాశి వారు నేడు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఈ బుధవారం మీ ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. నేడు అన్నింటా కలిసి రావడం సహా మీ అదృష్టం కూడా బాగుంటుంది. 

కన్య రాశి (Virgo)

వ్యాపారస్తులకు నేడు బాగా కలిసి వస్తుంది. మంచి ఫలితాలను పొందుతారు. వివిధ రంగాలలో పని చేసి వారికి పెద్ద మార్పు రావొచ్చు. 

తులా రాశి (Libra)

ఈ రాశి వారు నేడు తమ కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. వారి అవసరాలను తీరుస్తారు. బిజీ షెడ్యూల్ నుంచి కుటుంబంతో సరదాగా సమయం గడపడం మంచిది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించబోతున్నారు. 

వృశ్చిక రాశి (Scorpio)

బుధవారం ఈ రాశి వారిలో అశాంతి నెలకొంటోంది. ఆరోగ్యం క్షీణించడం వల్ల అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల చదువుపై దృష్టి సారించకపోవచ్చు. ఉద్యోగం చేసే వారికి ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి నేడు సాధారణ పరిస్థితులు ఉంటాయి. 

ధనుస్సు రాశి (Sagittarius)  

ఈ రాశి వారికి నేడు బాగా కలిసి వస్తుంది. కోర్టు సంబంధించిన విషయాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈ రాశి కలిగిన వారిలో ఉండే మానసిక బద్ధకం తొలగిపోతుంది. శుభవార్తలు వింటారు. 

మకర రాశి (Capricorn) 

మీ సహోద్యోగులతో మంచిగా వ్యవహరిస్తారు. వారి మెప్పును కూడా పొందుతుంటారు. డబ్బు సంపాదించడంతో పాటు కుటుంబంలో సంతోషాన్ని నెలకొల్పుతారు. అంతే కాకుండా పిల్లలపై శ్రద్ధ వహించాలి. 

కుంభ రాశి (Aquarius)

వివిధ రంగాల వారికి నేడు కలిసి వస్తుంది. తీపికబురు వింటారు. మీ వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. అలాగే మీరు ప్రజల నుంచి గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగంలో కూడా పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అంతే కాకుండా, మీరు ప్రమోషన్ కూడా పొందవచ్చు. 

మీన రాశి (Pisces) 

ఈ రాశి వారికి నేడు అవసరాలకు డబ్బు అందుతుంది. పాత స్నేహితులతో సమయాన్ని గడిపే అవకాశం ఉంది. రోజంతా సంతోషంగా, ఆహ్లాదంగా సాగిపోతుంది.

Also Read: Feb 8 2022 Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!

Also Read: Ratha Sapthami: తిరుమల చరిత్రలో తొలిసారిగా ఒకరోజుకు పరిమితం కానున్న రథసప్తమి వేడుకలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News