Mohammed siraj: మహ్మద్ సిరాజ్ ఐపీఎల్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు టీమ్ ఇండియా తరఫున కూడా తన సత్తా చాటుతున్న యువ బౌలర్. హైదరాబాద్‌కు చెందిన సిరాజ్.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి రాగలిగాడు.
కెరీర్ ఆరంభంలో అతడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాని తాజాగా గుర్తు చసుకున్నాడు సిరాజ్. గతంలో తనపై సోషల్ మీడియాలో కొంత మంది చేసిన కామెంట్లు బాధించాయన్నాడు.
అయితే టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని చెప్పిన మాటలు విన్న తర్వాత.. విమర్శల గురించి పట్టించుకోవడం మానేశానని తెలిపాడు.
సిరాజ్‌కు ఎదురైన చేదు అనుభవం ఏమిటంటే..
2018 ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడుతున్న సమయంలో.. తాను వరుసగా రెండు బీమర్లు వేశానని సిరాజ్ చెప్పాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చాలా మంది.. తనను ట్రోల్స్ చేశారని గుర్తు చేసుకున్నాడు సిరాజ్. 'నువ్వు క్రికెట్ వదిలేసి మీ నాన్నలాగే ఆటో నడుపుకో' కొంత మంది చేసిన కామెంట్స్ చూసి అప్పట్లో బాధ పడ్డట్లు చెప్పాడు.
అయితే టీమ్ ఇండియాకు సెలెక్ట్ అయినప్పుడు.. ధోని తనతో అన్న ఓ మాటను గుర్తు చేసుకున్నాడు సిరాజ్. ఇవాళ రాణిస్తే నిన్ను అందరూ పొగుడుతారని.. అదే విఫలమైతే వాళ్లే నిన్ను విమర్శిస్తారని చెప్పినట్లు తెలిపాడు. అందుకే ఎవరీ మాటలు పట్టించుకోవద్దని సూచించినట్లు సిరాజ్ వెల్లడించాడు.
ధోని అన్నట్లుగానే అప్పట్లో తనను దారుణంగా విమర్శించిన వాళ్లే ఇఫ్పుడు పొగుడుతున్నట్లు చెప్పాడు.
Also read: IND vs PAK T20 World Cup 2022: నిమిషాల్లో అమ్ముడుపోయిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు
Also read: Ahmedabad Titans: ఐపీఎల్ కొత్త టీమ్ పేరు 'అహ్మదాబాద్ టైటాన్స్'.. ప్రకటించిన సీవీసీ క్యాపిటల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Mohammed siraj: తనను దారుణంగా ట్రోల్స్ చేశారన్న యువ బౌలర్ మహ్మద్ సిరాజ్!
తనపై వచ్చిన విమర్శలను గుర్తు చేసికున్న మహ్మద్ సిరాజ్
గతంలో కొన్ని కామెంట్స్ బాధించాయని వెల్లడి
ధోని చెప్పిన సలహా బాగా పని చేసిందన్న యువ బౌలర్