ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. మంగళవారం రాత్రి అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)పై సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో తమ తొలి విజయాన్ని అందుకుంది. అసలే సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైన బాధతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ అయ్యర్‌కు రూ.12 లక్షల భారీ జరిమానా విధించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ సమయం బౌలింగ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. కాగా, ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి సైతం రూ.12 లక్షల జరిమానా విధించడం తెలిసిందే. పంజాబ్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా కోహ్లీకి జరిమానా విధించారు.



 


కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు ఓపెనర్లు బెయిర్ స్టో (53) హాఫ్ సెంచరీ, డేవిడ్ వార్నర్ (45), విలియమ్సన్ (41) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగుల చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులకు పరిమితమైంది. 15 పరుగుల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్ ఐపీఎల్ 2020లో తమ తొలి విజయాన్ని అందుకుంది. 



 


Also Read:



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe