ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా గురువారం రాత్రి జరిగిన 6వ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (Royal challengers Bengaluru)పై కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ (Kings XI Punjab) 97 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (132; 69 బంతుల్లో 14ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకం సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో KXIP కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌లో వేగంగా 2వేల పరుగుల మార్కు చేరిన భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. రాహుల్ తన 60వ ఇన్నింగ్స్‌లో భాగంగా ఐపీఎల్‌లో 2 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. ఓవరాల్‌గా చూస్తే క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు. గేల్ తన 48వ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 



అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ (KXIP) జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (132) అద్భుత శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ సేన (RCB) 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 97 పరుగుల భారీ ఓటమిని మూటగట్టుకుంది. 



ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe