CSK vs DC match review: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ( MS Dhoni ) మళ్లీ ట్రబుల్స్ మొదలయ్యాయి. మిస్టర్ కూల్‌గా పేరున్న ధోనీకి సైతం తన జట్టుపై తనకే కోపమొస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ ( Rajastan Royals ) జట్టు చేతిలో ఓటమిపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపిఎల్ టోర్నమెంట్‌లో వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడిపోయింది. ఐపిఎల్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) జట్టుపై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు.. ఆ తర్వాత రెండోసారి ఆడిన మ్యాచ్‌లో Rajastan Royals జట్టు చేతిలో 16 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడోసారి ఆడిన మ్యాచ్‌లో చెన్నైపై ఒత్తిడి తీవ్రమైంది. ఐతే అనూహ్యంగా ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 44 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఇలా రెండోసారి కూడా జట్టు పేలవమైన ప్రదర్శన చూపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ధోనీ సైతం తన టీమ్ ఆటగాళ్లపై అసహనాన్ని వెళ్లగక్కాడు. లోపం ఎక్కడుందనేది చెబుతూ వారికి పరోక్షంగా క్లాస్ తీసుకున్నాడు. Also read : MS Dhoni batting order: బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలకు ధోనీ రిప్లై


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్కే కెప్టేన్ ఎం.ఎస్. ధోనీ ( MS Dhoni ) మాట్లాడుతూ.. జట్టులో అంబటి రాయుడు లేని లోటు రెండో మ్యాచ్‌లో, మూడో మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించిందని అన్నాడు. మొదటి మ్యాచ్‌లో అంబటి రాయుడు ( Ambati Rayudu ) అద్భుతమైన ప్రతిభ కనబర్చాడని, అది జట్టుకు బాగా కలిసొచ్చిందని చెప్పిన ధోనీ.. గాయం కారణంగా జట్టుకు దూరమైన రాయుడు త్వరలోనే తిరిగి జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తంచేశాడు. రాయుడు జట్టులోకి వస్తే.. జట్టు తిరిగి బ్యాలెన్స్‌డ్‌గా ఆడుతుందనే ధీమా వ్యక్తంచేశాడు. Also read : IPL 2020: పృథ్వీ షా అదరగొట్టాడు.. చెన్నై ఓటమిని శాసించాడు


జట్టు వైఫల్యాల గురించి ధోనీ మాట్లాడుతూ.. బ్యాట్స్‌మెన్, బౌలర్స్ తమ ప్రతిభకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఆటగాళ్లలో ( CSK players ) జోష్ పెరగాలని చెబుతూ పరోక్షంగానే వారిపై కన్నెర్ర చేసిన ధోనీ.. ముఖ్యంగా బౌలర్స్ మరింత జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. రాబోయే మ్యాచుల్లో ఆటగాళ్లు వేగం పెంచకపోతే కష్టమని ధోనీ చేసిన వ్యాఖ్యలు అతడికి జట్టుపై ఉన్న అసంతృప్తిని చెప్పకనే చెప్పాయంటున్నారు క్రికెట్ ప్రియులు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe