MS Dhoni batting order: బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలకు ధోనీ రిప్లై

IPL 2020లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) 16 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓవైపు రాజస్థాన్ రాయల్స్ ( RR ) విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం ఉందని తెలిసినా.. సిఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు ( MS Dhoni ) రావడం ఏంటంటూ ధోనీపై సీనియర్ క్రికెటర్స్ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి.

Last Updated : Sep 26, 2020, 12:09 AM IST
MS Dhoni batting order: బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలకు ధోనీ రిప్లై

దుబాయ్‌: IPL 2020లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) 16 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓవైపు  రాజస్థాన్ రాయల్స్ ( RR ) విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం ఉందని తెలిసినా.. సిఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు (  MS Dhoni ) రావడం ఏంటంటూ ధోనీపై సీనియర్ క్రికెటర్స్ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముందే ధోనీ బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉండేవేమోనని ఎవరికి తోచిన విధంగా వారు ధోనీపై విరుచుకుపడ్డారు. టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపి ఎంపీ గౌతం గంభీర్ ( Gautam Gambhir ) సైతం ధోనీపై మండిపడ్డారు. జట్టును ముందుండి నడిపించాల్సిన వాడే వెనకుండిపోతే ఎలా అని ధోనీ వైఖరిని నిలదీసిన గంభీర్.. మ్యాచ్ చివర్లో ధోనీ రాబట్టిన పరుగులు కూడా అతడి వ్యక్తిగత ఖాతా కోసమేనని ఆరోపించారు. Also read : RR vs CSK match Highlights: ధోనీ సేనపై గెలిచిన Rajasthan Royals.. గెలిపించింది ఎవరు ? ఓడించింది ఎవరు ? 

ఐతే తాను యూఏఈకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్‌ సరిగ్గా చేయలేకపోయినందునే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చానని అప్పుడు ఆ విమర్శలకు ధోనీ చెప్పిన సమాధానం ఇంకొందరు సీనియర్స్‌కి కోపం తెప్పించింది. ధోనీ నిర్ణయాన్ని కెవిన్ పీటర్సన్ ( kevin pietersen ipl ) ఏకంగా నాన్‌సెన్స్ అంటూ కొట్టిపడేశాడు. 

ఇదిలావుండగా శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌ ( CSK vs DC ) జట్టుతో  Chennai Super Kings మ్యాచ్‌‌కి ముందు టాస్ వేసే సందర్భంగా ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి అడగ్గా, మ్యాచ్‌లో పరిస్ధితిని బట్టి జట్టుకు ఏది మంచిదైతే అదే చేస్తానని అన్నాడు.

మ్యాచ్‌ గమనాన్నిబట్టి నా బ్యాటింగ్‌ ఆర్డర్‌ ( Batting order ) మారుతుందని చెప్పిన ధోనీ... టోర్నమెంట్‌‌లో 14 మ్యాచ్‌లు ఉన్నాయని.. అలాగని ఆడిన అన్ని మ్యాచులు గెలవలేం కదా అని ప్రశ్నించాడు. భారీ లక్ష్యం కావడంతో లక్ష్య ఛేదన కష్టమైంది​ కానీ మేము కూడా 200 పరుగులు చేశామని.. అంటే బ్యాటింగ్ సరిగ్గానే ఉంది కదా అని ధోని అభిప్రాయపడ్డాడు. Also read : IPL 2020: పృథ్వీ షా అదరగొట్టాడు.. చెన్నై ఓటమిని శాసించాడు

 

Trending News