IPL 2020: పృథ్వీ షా అదరగొట్టాడు.. చెన్నై ఓటమిని శాసించాడు

ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా అద్భుతమైన అర్థసెంచరీతో రాణించడంతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) బౌలర్లు అదరొట్టేయడంతో మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendra Singh Dhoni )  సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది.

Last Updated : Sep 25, 2020, 11:54 PM IST
    • చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం.
    • చెన్నై మరో ఓటమి.
    • ఆసక్తికరంగా మారుతున్న ఐపీఎల్ 2020
IPL 2020: పృథ్వీ షా అదరగొట్టాడు.. చెన్నై ఓటమిని శాసించాడు

ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా అద్భుతమైన అర్థసెంచరీతో రాణించడంతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) బౌలర్లు అదరొట్టేయడంతో మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendra Singh Dhoni )  సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్,  చెన్నై సూపర్ కింగ్స్ మధ్య దుబయి అంతర్జాతీయ స్టేడియడంలో శుక్రవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ( Indian Premier League 2020 ) మ్యాచులో 44 పరుగులతో చెన్నై టీమ్ ఓటమిని చవిచూసింది.

ALSO READ|  SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు

ఈ టీమ్ కి  ఏమైంది ?

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటికీ ఫేవరిట్ టీమ్స్ లో ఒకటిగా ఉంటుంది. ఫలితాలతో సంబంధం లేకుండా చెన్నై మ్యాచులను చూస్తుంటారు క్రికెట్ అభిమానులు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ధోనీ టీమ్ ఓటమిని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ 2020 ని మంచి విజయంతో ప్రారంభించిన చెన్నై ఆ తరువాత మాత్రం అంతగా రాణించలేపోతోంది.

మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ తో సెప్టెంబర్ 20న జరిగిన మ్యాచులో సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచు ఐపీఎల్ కిక్ ఏంటో ప్రేక్షకులకు చూపించింది.

మ్యాచ్ సారాంశం

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 175/3

పృథ్వీ షా-64, పియుష్ చావ్లా 2-33

చెన్నై సూపర్ కింగ్స్ 131/7

ఫాఫ్ డు ప్లెసిస్ 43,  కగిసో రబాడ 3-26

ఫలితం: ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ పై 44 పరుగులతో విజయం సాధించింది.

ALSO READ|  SP Balasubrahmanyam: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం టాప్ 10 తెలుగు సాంగ్స్

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News