Anushka Sharma Trolled: విరాట్‌పై ఆక్రోశం..అనుష్కను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
Anushka Sharma Trolled: ఓ వైపు విరాట్ కోహ్లీపై అభిమానులు ఇంకా ఆశలు పెట్టుకుంటుంటే..మరికొందరు మాత్రం ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. విరాట్ విఫలమైతే..అతని భార్య అనుష్కను ట్రోల్ చేస్తున్నారు
Anushka Sharma Trolled: ఓ వైపు విరాట్ కోహ్లీపై అభిమానులు ఇంకా ఆశలు పెట్టుకుంటుంటే..మరికొందరు మాత్రం ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. విరాట్ విఫలమైతే..అతని భార్య అనుష్కను ట్రోల్ చేస్తున్నారు
క్రికెట్ పిచ్చి అంటే సాధారణం కాదు. అంతవరకూ ఆకాశానికి ఎత్తినవాళ్లే..ఒక్కసారిగా దించేస్తారు. గెలుపోటములు సహజమనే కనీస వాస్తవాన్ని గ్రహించరు. విజయం ఎప్పుడూ చెంతన ఉండదన్న వాస్తవాన్ని గ్రహించరు. అలా గ్రహించిన కొందరు మాత్రం ప్రోత్సాహాన్నిస్తారు. ధైర్యాన్నిస్తారు. గ్రహించని మూర్ఘులు మాత్రం ఆక్రోశం వెళ్లగక్కుతారు. అంతేకాకుండా ఇంట్లో కుటుంబసభ్యుల్ని, భార్తను సైతం ట్రోల్ చేస్తారు. టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ విషయంలో అదే జరుగుతోంది. కొందరు నీవే మా హీరో ఎప్పటికీ అని కామెంట్లు చేస్తుంటే..మరికొందరు మాత్రం పరిధి దాటి వ్యవహరిస్తున్నారు.
విరాట్ కోహ్లీ వరుసగా ఫ్లాప్ కావడంతో ఆతడి భార్య, బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మను జనం ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే వందలాది మంది అనుష్కను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారు. కొంతమంది పరిధి దాటేశారు. విరాట్ కోహ్లీ వైఫల్యానికి అనుష్క శర్మను బాధ్యురాలిగా చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా విరాట్ విఫలమైనప్పుడు అనుష్కను ట్రోల్ చేసేవారు. విరాట్ ఓ ఐదు నెలలు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకోవాలని..అనుష్క వద్ద ఉండాలని...ఎద్దేవా చేస్తున్నారు. అతడు మెంటల్‌గా ఫిట్‌గా లేడని విమర్శిస్తున్నారు. అనుష్కను పెళ్లి చేసుకోవడమనే ఓ తప్పుడు నిర్ణయం నీ పతనానికి దారి తీసిందంటూ ఇంకొందరు నేరుగానే కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం విచారకరం. నిన్న జరిగిన మ్యాచ్‌లో డకౌట్ కావడం అభిమానుల్ని నిరాశపర్చింది. విరాట్ కోహ్లీ ఈసారి ఎందుకో ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ డకౌట్ కావడం ఐపీఎల్ చరిత్రలో ఇది ఐదవసారి. తొలిసారి 2008లో తరువాత 2014లో, ఆ తరువాత 2017లో డకౌట్ అయ్యాడు. వరుసగా రెండవ మ్యాచ్‌లో డకౌట్ కావడం ఇదే. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున ఏ ఒక్కరూ నిలదొక్కుకోలేదు. ప్రతి ఒక్క ఆటగాడు వైఫల్యం చెందాడు. విరాట్ కోహ్లీ మాత్రం మొత్తం పరాజయ భారాన్ని మూటగట్టుకుంటున్నాడు. అందరితో ఆవమానాలు ఎదుర్కొంటున్నాడు. ఆఖరికి తన భార్యను కూడా ట్రోల్ చేస్తుంటే నిస్సహాయుడై చూస్తున్నాడు.
Also read: Virat Kohli Craze: కోహ్లీకి ధైర్యం చెబుతున్న అభిమానులు, తల దించుకోవద్దంటూ విజ్ఞప్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.