Virat Kohli Craze: ఇండియన్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకు ఉన్న క్రేజే వేరు. విజయం ఎప్పుడూ మనది కాదు. వైఫల్యం ఎప్పుడూ చెంతన ఉండదు. విఫలం చెందినంతమాత్రాన నువు హీరో కాకుండా పోవు. ఇదీ విరాట్ ప్రత్యేకత..అర్ధం కాలేదా..లెట్స్ హ్యావ్ ఎ లుక్..
టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీకు ఉన్న ప్రత్యేకతే వేరు. గత కొద్దికాలంగా ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ తీవ్రంగానే నిరాశపరుస్తున్నాడు. క్రికెట్‌లో విరాట్ కోహ్లీ క్రేజ్ ఎంతంటే..అతని అభిమానులు విరాట్ కోహ్లీ సెంచరీ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విరాట్ సెంచరీ చేసేవరకూ డైటింగ్ చేయనని ఓ మహిళ, ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచే వరకూ పెళ్లే చేసుకోనని మరో అమ్మాయి ఇలా బహిరంగంగా బ్యానర్లు ప్రదర్శించే పరిస్థితి.
ఐపీఎల్ 2022లో శనివారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. ఫాఫ్ డుప్లెసిస్ అవుటవడంతో క్రీజులో వచ్చిన కోహ్లీ..జాన్సెన్ వేసిన బంతికి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో సెకండ్ స్లిప్‌లో ఉన్న మార్క్‌క్రమ్ చేతికి చిక్కింది. అంతే డకౌట్‌గా వెనుదిరిగాడు. నిర్ఘాంతపోయిన విరాట్ కోహ్లీ అలానే నిలుచుండిపోయాడు. కోహ్లీకు ఈ సీజన్‌లో ఇది రెండవ గోల్డెన్ డక్. ఐపీఎల్ కెరీర్‌లో ఐదవ గోల్డెన్ డక్. మరోసారి విఫలం కావడంతో..తనకు తాను అవమానంగా భావించినట్టున్నాడు. అభిమానులు తనపై పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేసినందుకు నిరాశ పడ్డట్టున్నాడు. అవుటైన తరువాత బ్యాట్ ముఖానికి అడ్డం పెట్టుకుని..దించిన తల ఎత్తకుండా గ్రౌండ్ విడిచి వెళ్లాడు.
Dear @imVkohli,👍🏻 You Are the #King.👑 What Make You Down You Are Pride Of Many. You Are Strong. King 👑 Can't Be Down...💔😭#IPL2022 #RCB #ViratKohli #ViratKohli𓃵 #KingKohli #ನಮ್ಮRCB #RCBvSRH #Virat pic.twitter.com/QmPe3cLJxB
— 𝑷𝒂𝒘𝒂𝒏 𝑲𝒂𝒍𝒚𝒂𝒏 🗨️ (@Kalyanjspk) April 23, 2022
అయినా సరే అభిమానుల్లో అతడి క్రేజ్ ఎప్పటికీ తగ్గదని మరోసారి నిరూపితమైంది. ట్విట్టర్ వేదికగా అభిమానులు కోహ్లీకి వెన్నంటి నిలిచారు. కోహ్లీ..యూ ఆర్ ది కింగ్..వాట్ మేక్ యు డౌన్..యూ ఆర్ ప్రైడ్ ఆఫ్ మెనీ. యూ ఆర్ స్ట్రాంగ్..కింగ్..కెన్నాట్ బి డౌన్...అంటూ ప్రోత్సాహమిచ్చే...ధైర్యమిచ్చే కామెంట్లు చేస్తున్నారంటే విరాట్ కోహ్లీ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. కొన్ని మ్యాచ్‌లలో విఫలం చెందినంత మాత్రాన తల దించుకోవల్సిన అవసరం లేదు..నీవెప్పటికీ మా హీరోనే...ఎందరికే నువు గర్వ కారణం..ఎప్పుడూ తల దించకంటూ చేస్తున్న కామెంట్లు నిజంగా కోహ్లీ అదృష్టమని చెప్పాలి. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు.
Also read: RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ వరుసగా ఐదవ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.