IPL 2023: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోని వీడ్కోలు.. చివరి మ్యాచ్ అదే..!
MS Dhoni Retirement: ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని.. ఈ సీజన్ ద్వారా ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పనున్నాడు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని సీఎస్‌కే అధికారి ఒకరు వెల్లడించారు. అదేవిధంగా ధోని చివరి మ్యాచ్ తేదీని కూడా ఆయన చెప్పేశారు.
MS Dhoni Retirement: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందని సంబరపడిపోతున్న క్రికెట్ అభిమానులకు అంతలోనే బ్యాడ్ న్యూస్ వచ్చింది. టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇదే సీజన్ అని తేలిపోయింది. ఈ సీజన్ తరువాత ధోని రిటైర్మెంట్ అవుతున్న సీఎస్‌కే అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఇంకా మేనేజ్‌మెంట్‌కు చెప్పలేదన్నారు. ఈసారి చెన్నైలో మ్యాచ్‌లు జరుగుతుండడం సీఎస్‌కే అభిమానులకు ప్రత్యేక సందర్భం అని అన్నారు. ధోని తన చివరి మ్యాచ్‌ను ఆడితే అభిమానులకు ఎంతో బాధాకరమైన క్షణమని అన్నారు.
మే 14న చివరిసారిగా కెప్టెన్ కూల్‌ని చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో చూసే అవకాశం ఉంటుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మే 14న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోతే.. మే 14న ధోని తన చివరి మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో చెన్నై అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.
2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నాడు. గత సీజన్‌లో రవీంద్ర జడేజాకు ధోనీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాడు. అయితే జడేజా కెప్టెన్సీలో సీఎస్‌కే వరుస ఓటముల పాలైంది. దీంతో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. మళ్లీ ధోనినే పగ్గాలు చేపట్టాడు. ఈ ఏడాది కూడా మిస్టర్ కూల్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇప్పటివరకు నాలుగు టైటిళ్లు అందించిన ధోని.. చివరగా ఐపీఎల్ టోర్నీ గెలిచి సగర్వంగా వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు.
ధోని తరువాత చెన్నై జట్టుకు కెప్టెన్ ఎవరు అనే చర్చ మొదలైంది. జడేజా ఇప్పటికే విఫలమవ్వడంతో మళ్లీ అతనికి కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ లేదు. ప్రస్తుతం కెప్టెన్ రేసులో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో పాటు అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్‌లు ముందంజలో ఉన్నారు. ధోని రిటైర్మెంట్ తరువాత స్టోక్స్‌కే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 టీమ్: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ శాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌షౌ, తుషార్ దేశష్‌పాన్ పతిరానా, సిమర్‌జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, కైల్ జేమీసన్, అజయ్ మండల్, భగత్ వర్మ.
Also Read: Taraka Ratna: తారకరత్న విలన్‌గా నటించిన చిత్రాలు ఇవే.. ఆ సినిమాకు నంది అవార్డు
Also Read: Nandamuri Taraka Ratna: బాలయ్య రిప్లేస్ కోసమే తారకరత్న తెరపైకి..? చివరి కోరిక నెరవేరకుండానే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook