Nandamuri Taraka Ratna Passed Away: నందమూరి తారకరత్న మరణంతో సినీ ప్రపంచంతో పాటు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. చివరకు శనివారం తుది శ్వాస విడిచారు. జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభంరోజు ఆయన గుండెపోటుకు గురవ్వగా.. మొదట కుప్పం ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత బెంగుళూరుకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. తారకరత్న మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇటీవలె రాజకీయాల్లో తారకరత్న యాక్టివ్ అయ్యారు. తన బాబాయ్ బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం నుంచి తారకరత్న పోటీ చేస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. బాలయ్యను మరోస్థానంలో పోటీ చేయించి.. తారకరత్నను హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం భావించినట్లు టాక్ వచ్చింది. అయితే ఆ తరువాత గుడివాడ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ విషయం చంద్రబాబు, నారా లోకేష్‌కు కూడా తారకరత్న చెప్పారని.. వారు కూడా ఒకే చెప్పారని సమాచారం.
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు కూడా తారకరత్న ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉందని.. టీడీపీ అధికారంలోకి వస్తేనే బయటపడటం సాధ్యమవుతుందన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు తాను రాజకీయాల్లో వస్తున్నట్లు తెలిపారు. తన అడుగు ప్రజల వైపు అని.. తన చూపు రాష్ట్రాభివృద్ధి అని అన్నారు. ఇక నుంచి అదే లక్ష్యంతో పనిచేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరారు. తాను తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. బాలకృష్ణ బాబాయ్ ఆశయాలకు అనుకూలంగా నడుచుకుంటానని గతంలో తారకరత్న తెలిపారు. కానీ ఎమ్మెల్యేగా గెలవాలనే కోరిక నెరవేరకుండానే ఆయన తుది శ్వాస విడవటం టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: Taraka Ratna Biography: మరే హీరోకి సాధ్యం కాని రికార్డు.. పెద్దలను ఎదిరించి పెళ్లి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook