New Zealand Captain Kane Williamson on final Match against Australia: టీ20 వరల్డ్​ కప్​ ఫైనల్​ మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్​కోసం (T20 World Cup finals) ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్​కప్​లో తొలిసారి ఫైనల్స్​కు చేరిన కివీస్ జట్టు ఎలాగైనా కప్పుకొట్టాలనే కసితో ఉంది. ఆస్ట్రేలియా టీమ్ కూడా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా కనిపిస్తున్న కివీస్ జట్టును (NZ vs AUS) కట్టడి చేసి కప్పు కొట్టాలని కసరత్తు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో(t20 worldc cup final) ఈ ఇరు జట్లూ తలపడగా.. అప్పుడు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించి ప్రతికారం తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది.


మ్యాచ్​ గురించి అభిమానాలు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అలాంటిది కెప్టెన్​లు ఎలాంటి అంచనాలు పెట్టుకుని ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


Also read: T20 World Cup 2021 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో గెలిచేదెవరు?


అయితే కివీస్ జట్టు కెప్టెన్ కేన్​ విలియమ్సన్​ మాత్రం ఈ మ్యాచ్​ తమకు ఎప్పుడూ జరిగే ఓ సాధారణ మ్యాచ్​లాంటిదేనని చెప్పుకొచ్చాడు. నేటి మ్యాచ్ గురించి మీడియాతో మాట్లాడిన విలియమ్సన్​ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. దీనితో పాటు ఫైనల్ మ్యాచ్ గురించి పలు కీలక విషయాలనూ పంచుకున్నాడు.


ఫైనల్​ చేరుకోవడం తమ కష్టానికి ప్రతిఫలమన్నాడు విలియమ్సన్​. ఫైనల్లో చిన్న చిన్న విషయాలపై దృష్టి సారించి, గెలవడానికి ప్రయత్నిస్తాని (Kane Williamson on Final match) పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టు కలిసికట్టుగా ఆడుతోందని.. ప్రతి మ్యాచ్​లానే ఇందులోను ఏదో ఒక కొత్త విషయం  (Kane Williamson on AUS match) తెలుసుకుంటామన్నాడు. ఫైనల్స్ అయినా తమకు ఇదో అవకాశంగానే చూస్తామన్నాడు.


Also read: Kevin Pietersen: టీ20 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా...జోస్యం చెప్పిన పీటర్సన్!


Also read: T20 World Cup Final 2021: ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ టీమ్ గెలవడం ఖాయం!’


ఇలా జరగడం దురదృష్టకరం..


డెవాన్‌ కాన్వే ఫైనల్​ జట్టులో లేకపోవడం నిరాశ కలిగించిందన్నాడు విలియమ్సన్​. అతడు మాకు అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడని (Kane Williamson on Devon Conway) చెప్పాడు. గాయం కారణంగా డెవాన్‌ కాన్వే ఫైనల్ మ్యాచ్​కు దూరమయ్యాడు. ఇలా జరగటం దురదృష్టకరమన్నాడు విలియమ్సన్​.


సెమీ ఫైనల్స్​లో ఇంగ్లాడ్​తో జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్ అనూహ్య విజయం సాధించింది. ఇందులో 46 పరుగులు చేసి డెవాన్‌ కాన్వే జట్టులో కీలకంగా నిలిచాడు.


Also read: Sunil Gavaskar: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియానే ఫేవరెట్‌..ఎందుకంటే...


Also read: National Cricket Academy Director: నేషనల్ క్రికెట్ అకాడమీ కొత్త డైరెక్టర్ గా వీవీఎస్ లక్ష్మణ్.. ధ్రువీకరించిన సౌరవ్ గంగూలీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook