Kevin Pietersen: టీ20 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా...జోస్యం చెప్పిన పీటర్సన్!

Kevin Pietersen: టీ20 ప్రపంచకప్ 2021 ఎవరు గెలుస్తారనేది ముందుగానే  చెప్పేశాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. ఇంతకీ అతను ఏం చెప్పాడంటే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 05:51 PM IST
Kevin Pietersen: టీ20 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా...జోస్యం చెప్పిన పీటర్సన్!

T20 World Cup final: టీ20 ప్రపంచకప్(T20 WC 2021)లో భాగంగా...ఆదివారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్(T20 World Cup final) పోరు జరగనుంది. విజేత ఎవరో ముందుగానే జోస్యం చెప్పేశాడు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్(Kevin Pietersen ). ఈ సారి ఆసీస్ ఫేవరెట్ గా కనిపిస్తుందని..కచ్చితంగా కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇదే విషయమై పీటర్సన్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు.

Also Read: T20 World Cup Final 2021: ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ టీమ్ గెలవడం ఖాయం!’

''న్యూజిలాండ్‌ ప్రస్తుతం అన్ని  విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. కానీ ఆస్ట్రేలియానే నా ఫెవరెట్‌. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు ఫైనల్లో ఎదురుపడినప్పుడు ఆస్ట్రేలియా రికార్డు బాగుంది. 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో జరిగింది ఇదే. ఈ ఆదివారం ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక డేవిడ్‌ వార్నర్‌ మంచి ఫామ్‌లో ఉండడం న్యూజిలాండ్‌కు ప్రమాదకరం.

ఐపీఎల్‌లో తీవ్ర నిరాశ పరిచిన వార్నర్(David Warner)...ఆ కోపాన్ని , ఫామ్ ను ఈ ప్రపంచ కప్ లో చూపిస్తున్నాడని పీటర్సన్ పేర్కొన్నాడు. అతనికి తోడూ గత మ్యాచ్‌లో వేడ్‌, స్టోయినిస్‌లు అద్భుతం చేసి చూపించారు. ఆస్ట్రేలియా జట్టు పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్‌లోనూ కొన్నేళ్లుపాటు ఆదిపత్యం చెలాయించారు. తాజాగా టీ20 ప్రపంచకప్‌ను గెలిస్తే... ఇకపై టీ20ల్లోనూ తమ బలాన్ని చూపించే అవకాశం ఉంది'' అంటూ పీటర్సన్  చెప్పాడు.

Also Read: Warner Six On Dead Ball: ‘వార్నర్ అలాంటి షాట్ ఆడడం సిగ్గుచేటు’.. గౌతమ్ గంభీర్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News