India T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. కొంపముంచిన బౌలర్లు
England Beat India: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరు ముగిసింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ సునాయసంగా విజయం సాధించింది.
England Beat India: కోట్లాది మంది అభిమానుల ఆశలు అడిశలయ్యాయి. తప్పకుండా కప్ గెలుస్తుందనుకున్న టీమిండియాను ఇంగ్లాండ్ చిత్తు చేసింది. టఫ్ వార్ తప్పదకున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తేలిపోయారు. ముఖ్యంగా బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. భారత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరే కేవలం ఓవర్లలో కొట్టారంటే.. ఏస్థాయిలో విజృంభించారో అర్థం చేసుకోవచ్చు. జోస్ బట్లర్ (80), అలెక్స్ హేల్స్ (86) నాటౌట్‌గా నిలిచారు. టీమిండియాపై విక్టరీతో ఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లాండ్.. పాకిస్థాన్‌తో తలపడనుంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. గత రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో టచ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్‌లో 5 పరుగులకే ఔట్ అయ్యాడు. ఫామ్‌లో లేని రోహిత్ శర్మ (28 బంతుల్లో 27) పెద్దగా ఆకట్టుకోలేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సూర్య కుమార్ యాదవ్ (14) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. మరో ఎండ్‌లో కుదరుకున్న విరాట్ కోహ్లీ (40 బంతుల్లో 50) మరో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే స్కోరు బోర్డు వేగం పెంచాల్సిన సమయంలో క్యాచ్ ఔట్ రూపంలో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 63) వీరవిహారం చేయడంతో 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇంగ్లాండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ చెలరేగి ఆడారు. రన్ రేట్ 10కి తగ్గకుండా బౌలర్లను చితక్కొట్టారు. ఈ టోర్నీలో పెద్దగా ఆకట్టులేకపోయిన అలెక్స్ హేల్స్ ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఏకంగా ఏడు సిక్సర్లు, నాలుగు ఫోర్ల సాయంతో 47 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ బట్లర్ కూడా చితక్కొట్టాడు. 49 బంతుల్లో మూడు సిక్సర్లు, 9 ఫోర్లతో 80 రన్స్ చేశాడు. దీంతో 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. టోర్నీ ఆసాంతం రాణించిన భారత బౌలర్లు.. కీలక మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు.
అర్షదీప్, అక్షర్ పటేల్ కాస్తా పర్వాలేదనిపించినా.. మిగిలిన బౌలర్లు అందరూ ఓవర్‌కు 10 పరుగులకు పైగానే సమర్పించుకున్నారు. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌కు దక్కింది. పాకిస్థాన్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు ఆదివారం జరగనుంది.
Also Read: Hardik Pandya: హార్ధిక్ పాండ్యా వికెట్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
Also Read: Ravindra Jadeja: భార్యకు ఎమ్మెల్యే టికెట్ దక్కడంపై రవీంద్ర జడేజా హ్యాపీ.. ట్విట్టర్‌లో సందేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook