అబూధాబీ: ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం అబూధాబీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ( MI vs CSK opening match IPL 2020 ) మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐపిల్ 2020 సీజన్‌లో జట్టుకి తొలి విజయం అందించిన కెప్టేన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendra Singh Dhoni ) రికార్డు సొంతం చేసుకున్నాడు. Also read : MS Dhoni new look: ఐపిఎల్ 2020లో క్రేజీగా ఉన్న ధోని న్యూ లుక్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపిల్ 2020 ఓపెనింగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టులో ఓపెనర్లు వాట్సన్ 4 పరుగులకు, మురళి విజయ్ ఒక్క రన్‌కే ఔట్ అయ్యారు. Also read : Rohit Sharma: ఎంత మంది వచ్చినా నా స్థానమిదే: రోహిత్ శర్మ


చెన్నై సూపర్ కింగ్స్‌లో తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన తెలుగు తేజం అంబటి రాయుడు ( Ambati Rayudu ) మరో బ్యాట్స్‌మన్ డూప్లెసిస్‌తో కలిసి చెలరేగిపోయాడు. అంబటి రాయుడు 48 బంతుల్లో 71 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాబట్టగా.. డూప్లెసిస్ ( Faf du Plessis ) 44 బంతుల్లో 58 పరుగులు (6 ఫోర్లు ) చేశాడు. ఇద్దరూ అర్థ సెంచరీలతో రానించడంతో ధోనీ సేన మరో 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి విజయం సొంతం చేసుకుంది. Also read : MI vs CSK: ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్.. మినీ ఫైనల్!


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR