MI vs SRH match score updates: ఐపిఎల్ 2020లో భాగంగా ఆదివారం షార్జా స్టేడియం వేదికగా జరిగిన 17వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ SunRisers Hyderabad జట్టుపై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్‌కి ఓటమి తప్పలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mumbai Indians బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (6) సందీప్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు. క్వింటన్ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడుతూ మ్యాచ్‌ని ముందుకి తీసుకెళ్లారు. డీకాక్‌ 67 పరుగులతో ( 39 బంతుల్లో 4X4, 6X4 ) రాణించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 27 పరుగులు ( 18 బంతుల్లో 6X4) ), ఇషాన్‌ కిషన్‌ 31 పరుగులు ( 23 బంతుల్లో 4X1, 6X2), హార్దిక్‌ పాండ్యా 28 పరుగులు (19 బంతుల్లో 4X2, 6X2), పొలార్డ్‌ 25 పరుగులు ( 13 బంతుల్లో 6X3) ఆకట్టుకున్నారు. Also read : CSK vs SRH, IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ గెలుపు.. ధోనీకి మరో దెబ్బ!


చివర్లో బ్యాటింగ్‌కి వచ్చిన కృనాల్‌ పాండ్యా సైతం తన బ్యాట్ ఝులిపించాడు. 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆటగాళ్లందరూ సమష్టికృషితో రాణించడంతో ముంబై ఇండియన్స్‌ 208 పరుగులు చేసింది. సన్ రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌లు చెరో రెండు వికెట్లు తీసుకోగా రషీద్‌ ఖాన్‌కు ఒక వికెట్‌ దక్కింది. Also read : Dinesh Karthik: కేకేఆర్ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ విఫలం.. మోర్గాన్‌ అయితే బెస్ట్: శ్రీశాంత్


లక్ష్య చేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మేన్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60 పరుగులు ( 44 బంతుల్లో 4X5, 6X2)లతో రాణించాడు. బెయిర్ స్టో 25 పరుగులు, మనీష్ పాండే 30 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కేన్ విలియమ్సన్ (3) మరోసారి నిరాశపరిచాడు. చివరి మ్యాచ్‌లో  చెన్నై సూపర్ కింగ్స్పై చెలరేగిన ప్రియమ్ గార్గ్ (8) కూడా ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. దీంతో సన్‌రైజర్స్‌‌కి 34 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. Also read : SRH vs MI Match IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ కొడుతుందా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe