CSK vs SRH, IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ గెలుపు.. ధోనీకి మరో దెబ్బ!

CSK vs SRH match, IPL 2020: దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌‌పై ( Chennai Super Kings ) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ( Sunrisers Hyderabad ) 7 పరుగుల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో మరో విజయం సొంతం చేసుకుంది. దీంతో IPL 2020లో ఇప్పటివరకు మొత్తం 4 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ జట్టు రెండు మ్యాచ్‌లో విజయం సాధించినట్టయింది.

Last Updated : Oct 3, 2020, 12:53 AM IST
CSK vs SRH, IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ గెలుపు.. ధోనీకి మరో దెబ్బ!

CSK vs SRH match, IPL 2020: దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్పై ( Chennai Super Kings ) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ( SunRisers Hyderabad ) 7 పరుగుల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో మరో విజయం సొంతం చేసుకుంది. దీంతో IPL 2020లో ఇప్పటివరకు మొత్తం 4 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ జట్టు రెండు మ్యాచ్‌లో విజయం సాధించినట్టయింది. Also read : MS Dhoni IPL records: ధోనీ ఖాతాలో మరో ఐపిఎల్ రికార్డు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి164 పరుగులు చేయగా.. 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టపోయి 157 పరుగులే చేయగలిగింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కి వరుసగా మూడోసారి ఓటమి తప్పలేదు. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి విమర్శలపాలవుతున్న మహేంద్ర సింగ్ ధోనీకి ( Mahendra Singh Dhoni ) ఈ ఓటమి మరో దెబ్బ లాంటిదనే చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో ధోనీ (47 పరుగులతో వ్యక్తిగత స్కోర్ పరంగా రాణించినప్పటికీ.. జట్టు ఓటమిపాలవడం అనేది ఇబ్బందికరమైన పరిణామమే. Also read : IPL 2020: దూకుడు చూపిస్తాం అంటున్న చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News