ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో నేడు మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు పటిష్టమైన బౌలింగ్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కు, పటిష్టమైన బ్యాటింగ్ టీమ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మధ్య ప్రారంభం కానుంది. గత రెండు మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి సన్ రైజర్స్ ఫామ్‌లో ఉంది.
Dinesh Karthik: కేకేఆర్ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ విఫలం.. మోర్గాన్ అయితే బెస్ట్: శ్రీశాంత్
కేన్ విలియమ్సన్ చేరికతో సన్‌రైజర్స్ బలం రెట్టింపయింది. కెప్టెన్సీతో డేవిడ్ వార్నర్‌కు కేన్ సలహాలు అదనపు బలం అవుతున్నాయి. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయంతో ముంబై ఇండియన్స్ జోష్‌లో ఉంది. అయితే యూఏఈలో చిన్న స్టేడియం షార్జాలో నేడు సిక్సర్ల వరద పారే అవకాశం ఉంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించాలని సన్‌రైజర్స్ చూస్తోంది.
Also Read : DC vs KKR: షార్జా స్టేడియంలో అంత ఈజీ కాదు: Shreyas Iyer
కెప్టెన్ డేవిడ్ వార్నర్ రాణిస్తున్నా అతడి బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. తొలి రెండు మ్యాచ్‌లలో లేకున్నా, లేటుగా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్గా జట్టులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ పరవాలేదనిపించాడు. ముంబై ఇండియన్స్ లాంటి జట్టుతో పోరు అంటే బెయిర్ స్టో, మనీశ్ పాండే సైతం భారీ ఇన్నింగ్స్ ఆడక తప్పదు. చెన్నైతో మ్యాచ్‌లో కాలికి గాయంతో చివర్లో మైదానాన్ని వీడిన భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనేది కీలకం కానుంది. రషీద్ ఖాన్ గత మ్యాచ్‌లో వికెట్ తీయకున్నా 4 ఓవర్లలో కేవలం 12 పరుగుల ఇచ్చిన చెన్నై ఓటమికి తాను కారణం అయ్యాడు. నబీ, ఖలీల్‌లు అందివచ్చిన అవకాశాలు చేజార్చుకోరాదు. నటరాజన్ యార్కర్లు షార్జాలాంటి చిన్న స్టేడియం మ్యాచ్‌లో ఏ మాత్రం ఫలితాన్నిస్తాయో చెప్పలేం.
Also Read: Rohit Sharma IPL Runs: విరాట్ కోహ్లీ, సురేష్ రైనా సరసన రోహిత్ శర్మ
రో‘హిట్’ అవుతాడా?
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఇప్పటికే రెండు భారీ ఇన్నింగ్స్‌లు వచ్చాయి. అయితే పటిష్ట బౌలింగ్ ఉన్న సన్‌రైజర్స్‌పై రోహిత్ రాణించడంపైనే ముంబై టాపార్డర్ ఆధారపడి ఉంది. క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్ రాణించడంతో ముంబై గట్టెక్కుతోంది. పోలార్డ్, హార్దిక్ పాండ్యాలు కీలక సమయంలో వచ్చి, చివరి ఓవర్లలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నారు. పాండ్యా బ్రదర్స్‌ను సిక్సర్ల నుంచి అడ్డుకోవాలి. స్టార్ పేసర్లు జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చహర్‌లు బౌలింగ్‌లో రాణిస్తున్నారు. పాటిన్సన్ సైతం తన మార్కు బౌలింగ్ చేస్తున్నాడు.
Also Read: Jonny Bairstow: వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కు ఇంగ్లాండ్ షాక్.. కోట్లలో నష్టం!
జట్ల అంచనా... సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, నటరజన్, భువనేశ్వర్/(సందీప్ శర్మ?)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, పోలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, పాటిన్సన్, రాహుల్ చహర్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్