MS Dhoni about IPL 2021: వచ్చే ఏడాది ఐపిఎల్‌లో పాల్గొనడంపై స్పందించిన ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ( MS Dhoni ) ఐపిఎల్ 2020 కలిసి రాలేదు. ఈ సీజన్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ( Chennai super Kings ) ప్లేఆఫ్స్ రేసులో నిలవలేదు. గెలవాల్సిన మ్యాచ్‌లు కూడా ఓడుతూ రావడం.. 13 మ్యాచ్‌ల్లోనూ ధోనీ మొత్తం స్కోర్ కేవలం 200 పరుగులే కావడం వంటివి అతడిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ( MS Dhoni ) ఐపిఎల్ 2020 కలిసి రాలేదు. ఈ సీజన్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ( Chennai super Kings ) ప్లేఆఫ్స్ రేసులో నిలవలేదు. గెలవాల్సిన మ్యాచ్‌లు కూడా ఓడుతూ రావడం.. 13 మ్యాచ్‌ల్లోనూ ధోనీ మొత్తం స్కోర్ కేవలం 200 పరుగులే కావడం వంటివి అతడిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. గతంలో అదే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి 3 ఐపిఎల్ ట్రోఫీలు అందించిన ధోనీ సత్తా గురించి తెలిసిన వాళ్లు అతడిని వేలెత్తి చూపకపోయినా.. కొంతమంది ధోనీ ఓటములపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో వచ్చే ఐపిఎల్ సీజన్‌లో ( IPL 2021 ) ధోనీ పాల్గొనే అవకాశాలు లేవని కొందరు, ఒకవేళ పాల్గొన్నా.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అతడిని తీసుకోకపోవచ్చని ఇంకొందరు రకరకాల కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. Also read : Jr NTR request to Rajamouli: రాజమౌళికి ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్
అయితే, ఇదే విషయమై తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో ( KXIP vs CSK match ) మ్యాచ్‌కి ముందు టాస్ సందర్భంగా ధోనీతో కామెంటేటర్ డేనీ మారిసన్ మాట్లాడుతూ.. ''చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇదే నీ చివరి మ్యాచ్'' అని భావిస్తున్నారా అని అడగ్గా.. ''తప్పకుండా ఇది చివరి మ్యాచ్ కాదు'' అంటూ ధోనీ సమాధానం ఇచ్చాడు. తాను వచ్చే ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపునే తాను ఐపిఎల్ 2020 బరిలో దిగుతాను అని ధోనీ చెప్పకనే చెప్పేశాడన్న మాట. ధోనీ చెప్పిన ఈ మాటలు అతడి అభిమానులకు కచ్చితంగా ఎంతో ఆనందానికి గురిచేస్తాయడనడంలో సందేహం లేదు. Also read : SRH Playoffs: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంత ఈజీ కాదు!
చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశి విశ్వనాథన్ ( CSK CEO Kasi Viswanathan ) సైతం గతంలో ఇదే విషయంపై స్పందిస్తూ... ఒక్కసారి సరిగ్గా ఆడనంత మాత్రాన్నే అన్ని మార్చేయాలనుకోవడం తప్పని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అంతేకాకుండా గతంలో తమ ఫ్రాంచైజీకి మూడు టైటిల్స్ అందించిన ధోనీ సామర్ధ్యాన్ని సందేహించాల్సిన అవసరం లేదని చెప్పి అతడిని సమర్ధించడంతో పాటు వచ్చే ఏడాది కూడా ధోనీ తమ జట్టులోనే ఆడుతాడని తేల్చిచెప్పాడు. దీనికితోడు ఇప్పుడు ధోని కూడా అదే చెప్పడం అతడి అభిమానులకు ఊరటనిచ్చే అంశం. Also read : SRH vs RCB Match IPL 2020: సన్‌రైజర్స్ బౌలర్లపై డివిలియర్స్ ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe