National Sports Awards: 2021 సంవత్సరానికి గానూ జాతీయ క్రీడా అవార్డుల (National Sports Awards 2021) విజేతలకు పురస్కారాలు స్వయంగా బహుకరించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind News). కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడచిన ఏడాది కాలంలో దేశం తరఫున క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన 12 మంది క్రీడాకారులకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న (Khel Ratna Award 2021) ప్రదానం చేశారు రాష్ట్రపతి కోవింద్. వీరిలో టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), మన్ప్రీత్ సింగ్, శ్రీజేశ్ (హాకీ), రవి కుమార్ (రెజ్లింగ్), లవ్లీనా బోర్గోహైన్ (బాక్సింగ్) ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పారాలింపిక్స్ అథ్లెట్లు అవనీ లేఖరా, సుమిత్ అంతిల్, ప్రమోద్ భగత్, కృష్ణ నాగర్, మనీష్ నర్వాల్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, ఫుట్బాలర్ సునీల్ ఛెత్రి.. కూడా ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు.


అర్జున అవార్డుకు ఎంపికైన క్రీడాకారులు


నిషద్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), యోగేష్ కథునియా (డిస్కస్ త్రో), సుహాస్ ఎల్వై (బ్యాడ్మింటన్), సింగ్‌రాజ్ అధానా (షూటింగ్), భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ), శిఖర్ ధావన్ (క్రికెట్) సహా శ్రీజేశ్, మన్ప్రీత్ మినహా హాకీ ఇండియా పురుషుల జట్టుకు అర్జున అవార్డు (Arjuna Award 2021) ప్రదానం చేశారు.


Also Read: Zainab Abbas On Siraj: సిరాజ్ బౌలింగ్ కు ఫిదా అయిన పాకిస్థానీ యాంకర్


Also Read: T20 World Cup Final 2021: ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ టీమ్ గెలవడం ఖాయం!’


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook