Jos Buttler hits a huge six even the ball lands outside the pitch: గత కొంత కాలంగా ఇంగ్లండ్‌ వన్డే వైస్‌ కెప్టెన్‌ జోస్ బట్లర్‌ పరుగులు వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022లో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 863 రన్స్ చేశాడు. అదే ఫామ్ నెదర్లాండ్స్‌తో జరిగిగిన మూడు వన్డేల సిరీస్‌లో కూడా కొనసాగించాడు. బంతి దొరికడమే ఆలస్యం బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో డెడ్‌ బాల్‌, వైడ్‌ బాల్‌, నో బాల్‌ అని కూడా చూడకుండా బంతిని మైదానం బయటకి పంపిస్తున్నాడు. తాజాగా పిచ్ ఆవల పడిన బంతిని కూడా వదలలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 498 పరుగులు అత్యధిక వన్డే స్కోరును అందుకోవడంలో జోస్ బట్లర్‌ కీలక పాత్ర పోషించాడు. 162 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. మూడో వన్డేలో కూడా 86 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 64 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 86 పరుగులు బాదాడు.ఈ మ్యాచ్‌లో బట్లర్‌ కొట్టిన ఒక సిక్స్‌ హైలైట్‌గా నిలిచింది. 


29వ ఓవర్‌ను నెదర్లాండ్స్‌ బౌలర్‌ పాల్‌ వాన్‌ మీక్రిన్‌ వేశాడు. అప్పటికే హాఫ్ సెంచరీ బాదిన జోస్ బట్లర్‌ మంచి ఊపుమీదున్నాడు. ఆ ఓవర్‌ ఐదో బంతిని పాల్‌ షార్ట్‌ పిచ్‌ వేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని సాధించడంలో విఫలమైన పాల్‌.. హాఫ్ పిచ్‌లో కూడా వేయలేకపోయాడు. బంతి ఓసారి పిచ్‌లో పడి క్రీజు పక్కకు పోయింది. క్రీజు ఆవల మరోసారి పిచ్‌ అయిన బంతిని బట్లర్‌ క్రీజు నుంచి మొత్తం పక్కకు జరిగి భారీ సిక్సర్‌ బాదాడు. ఇది చూసిన మైదానంలోని ఆటగాళ్లు, స్టేడియంలోని ఫాన్స్ తెగ నవ్వుకున్నారు. 



అంపైర్‌ ఆ బాల్‌ను నో బాల్‌ ఇచ్చి ఫ్రీ హిట్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఆ ఫ్రీ హిట్‌ను కూడా జోస్ బట్లర్‌ సిక్సర్‌గా మలవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చుసిన వారు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'అంతకుమించి సిక్స్' అని ఒకరు కామెంట్ చేయగా, 'జోస్ బట్లర్‌.. ఏ బంతిని వదలవా' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Maharashtra Political Crisis: కొనసాగుతున్న 'మహా' డ్రామా..ఏక్‌నాథ్‌ శిందే వైపు ఎమ్మెల్యేల క్యూ..!


Also Read: Sravanam Masam 2022: ఈ ఒక్క ఉపవాసం మీకు అపారమైన సంపదను ఇస్తుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.