పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం వేటు పడింది. ఏ ఫార్మాట్‌లోనూ నిషేధకాలంలో ఆడేందుకు వీలు లేదని సైతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 20 నుంచి మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్‌లోనూ ఆడకుండా అక్మల్‌పై వేటు పడింది. ఈ ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు కొన్ని రోజుల ముందు కొందరు బుకీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని కోరుతూ ఉమర్ అక్మల్‌ను సంప్రదించారు.  భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పతనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు తెలుసుకుంది. అక్మల్‌ను వివరణ కోరింది, విచారణ సైతం చేపట్టింది. కానీ సరైన సమాధానం రాకపోవడంతో పాటు జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు బుకీలు తమను సంప్రదిస్తే చెప్పాలన్న నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా నిషేధం వేటు వేసింది. ఉమర్ అక్మల్ కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 ట్వంటీ20 మ్యాచ్‌లలో పాక్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. . Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!


తొలి టెస్టులోనే శతకం బాది నిరూపించుకున్న ఉమర్ అక్మల్.. క్రమశిక్షణ లేక పలుమార్లు చివాట్లు తిన్నాడు. దురుసు ప్రవర్తలో తరచుగా జట్టులో చోటు కోల్పోతున్నాడు. అతడిపై పోలీసు కేసులు కూడా ఉన్నాయి. అన్న కమ్రాన్ అక్మల్‌ను మించిపోతాడని పాక్ మాజీలు సైతం కితాబిచ్చారు. కానీ క్రమశిక్షణ లేని, బాధ్యతారాహిత్య గేమ్ అంత ఈజీగా కాదని గ్రహించలేకపోయాడు ఉమర్ అక్మల్.  సమంత బర్త్‌డే.. నాగచైతన్య సర్‌ప్రైజ్



రమీజ్ రాజా ఆగ్రహం
టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్ ఉమర్ అక్మల్ ఫిక్సింగ్‌లో చిక్కుకోవడంపై పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇడియట్స్ జాబితాలో చేరిపోయాడు. మూడేళ్లపాటు ఏ మ్యాచ్ ఆడలేడు. టాలెంట్‌ను వేస్ట్ చూసుకున్నాడని మండిపడ్డాడు. ఈ మేరకు రమీజ్ రాజా ఓ ట్వీట్ చేశాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos