బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు భారీగా పెరగగా, వెండి ధరలు పతనమయ్యాయి. లాక్‌డౌన్ టైమ్‌లో అక్షయ తృతీయ రావడంతో వెలవెలబోయిన బులియన్ మార్కెట్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. సైకిల్‌పై 3000 కి.మీ.. హైదరాబాద్‌లో టైర్ పంక్చర్.. కార్మికుడి కష్టాలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.970 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,900కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,120 పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.44,740కి జంప్ అయింది. బంగారం ధరలు గత 10 రోజుల గరిష్ట ధరలు నమోదుచేశాయి. . ఆ అమ్మాయిలతోనే సుఖం, సంతోషం: శ్రీరెడ్డి
నేడు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,620 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,650కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,030 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,150 వద్ద ర్యాలీ అవుతోంది. Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!
వరుసగా నాలుగు రోజులు పెరిగిన వెండి ధరలు నేడు అమాంతం దిగొచ్చాయి. నేటి మార్కెట్‌లో 1కేజీ వెండి ధర రూ.400 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.42,200కి క్షీణించింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..