T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ దిశగా పాకిస్తాన్, 4 పాయింట్లతో అగ్రస్థానం
T20 World Cup లో పాకిస్తాన్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్స్ వైపు అడుగులేస్తోంది. తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియాను మట్టికరిపించిన పాకిస్తాన్, రెండవ మ్యాచ్‌లో కవీస్‌ను ఓడించింది. 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
T20 World Cup లో పాకిస్తాన్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్స్ వైపు అడుగులేస్తోంది. తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియాను మట్టికరిపించిన పాకిస్తాన్, రెండవ మ్యాచ్‌లో కవీస్‌ను ఓడించింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) షార్జా క్రికెట్ స్డేడియంలో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. న్యూజిలాండ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి టీ20 ప్రపంచకప్‌లో తన జైత్రయాత్రను కొనసాగించింది పాకిస్తాన్. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత లక్ష్య సాధనకు దిగిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి..విజయం సాధించింది. షోయబ్ మలిక్ 26 పరుగులతో, ఆసిఫ్ అలీ 27 పరుగులతో మెరుగైన ఆటతీరు కనబర్చి జట్టును గెలిపించారు. టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్‌కు(Pakistan)ఇది వరుసగా రెండవ విజయం.
న్యూజిలాండ్(Newzealand)తరపున సౌథీ రెండు వికెట్లు దక్కించుకోగా బోల్ట్, జేమ్స్,సెంటేనర్‌లు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. షార్జా స్లో పిచ్‌పై లక్ష్యాన్ని ఛేధించేందుకు బరిలో దిగిన పాకిస్తాన్ తొలుత చిక్కుల్లో పడింది. ఓపెనర్, టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam) 9 పరుగులు సాధించి సౌధీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయి వెనుదిరిగాడు. పవర్ ప్లేలో ఒక వికెట్ కోల్పోయి 30 పరుగులు సాధించింది పాకిస్తాన్. ఆ తరువాత కాస్సేపటికే ఫఖార్ జమాన్ 11 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన మొహమ్మద్ హఫీజ్ వెంటనే అవుట్ కాగా మొహమ్మద్ రిజ్వాన్ 33 పరుగులు సాధించి అవుటయ్యాడు. చివరికి బరిలో దిగిన షోయబ్ మలిక్, అలీల మెరుగైన ఆటతీరుతో పాకిస్తాన్ జట్టును గెలిపించారు.
ప్రస్తుతం పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడి..రెండింటిలోనూ విజయంతో 4 పాయింట్లు సాధించి గ్రూప్ 2లో అగ్రస్థానంలో ఉంది. అటు రన్‌రేట్ పరంగా కూడా పాకిస్తాన్ టాప్‌లో ఉంది. సెమీస్‌లో(Pakistan towards Semi Finals)దూసుకెళ్లేందుకు సిద్ఘంగా ఉంది. ఎందుకంటే గ్రూప్ 2లో ఇప్పటికే పాకిస్తాన్..ఇండియా, న్యూజిలాండ్ జట్లపై విజయం సాధించింది. ఇక మిగిలింది ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లండ్, నమీబియాలు మాత్రమే. పాకిస్తాన్ తరువాత ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాలు రెండేసి పాయింట్లు సాధించాయి.
Also read: PAK vs NZ T20 World Cup 2021: న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం.. చెలరేగిపోయిన Haris Rauf, Asif Ali
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook