Roger Federer`s Retirement: రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్.. షాక్‌లో టెన్నిస్ ప్రియులు
Roger Federer Retirement News: రోజర్ ఫెదరర్ ఇంటర్నేషనల్ టెన్నిస్‌కి రిటైర్మెంట్ ప్రకటించి టెన్నిస్ ప్రియులకు షాకిచ్చాడు. వచ్చే వారం జరగనున్న లావర్ కప్ తన కెరీర్‌లో ఆఖరి టోర్నమెంట్ కానుందని రోజర్ ఫెదరర్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.
Roger Federer Retirement News: రోజర్ ఫెదరర్ ఇంటర్నేషనల్ టెన్నిస్‌కి రిటైర్మెంట్ ప్రకటించి టెన్నిస్ ప్రియులకు షాకిచ్చాడు. వచ్చే వారం జరగనున్న లావర్ కప్ తన కెరీర్‌లో ఆఖరి టోర్నమెంట్ కానుందని రోజర్ ఫెదరర్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు. లావర్ కప్ తర్వాత మళ్లీ ఇంటర్నేషనల్ టెన్నిస్ కోర్టులో రోజర్ ఫెదరర్ లైవ్ పర్‌ఫార్మెన్స్ చూడలేమనే ఆలోచన ఫెదరర్ ఫ్యాన్స్‌ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం ఫెదరర్ వయస్సు 41 ఏళ్లు కాగా.. తన మొత్తం కెరీర్‌లో 20 గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు.
అత్యధిక స్థాయిలో రికార్డులు సొంతం చేసుకున్న ఏకైక ఆటగాడిగా రోజర్ ఫెదరర్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. రోజర్ ఫెదరర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ప్రపంచం నలుమూలలా ఏ క్రికెట్ ఆటగాడికి కూడా లేనంత అభిమాన బలగం రోజర్ ఫెదరర్ సొంతం.
2021 జులైలో జరిగిన వింబుల్డన్ పోటీల తర్వాత రోజర్ ఫెదరర్ మళ్లీ ఏ టోర్నమెంట్‌లోనూ పోటీపడలేదు. ఆ తర్వాత మోకాలి గాయంతో బాధపడిన ఫెదరర్‌కి వివిధ శస్త్రచికిత్సలు జరిగాయి. ట్విటర్ ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటన షేర్ చేసిన రోజర్ ఫెదరర్.. గత మూడేళ్లలో గాయాలు, శస్ర్తచికిత్సలు తన జీవితంలో ఓ భాగమైపోయాయని పేర్కొన్నాడు. లండన్‌లో జరగనున్న లావర్ కప్ టోర్నమెంట్సే తనకు వీడ్కోలు వేదిక కానున్నట్టు ఫెదరర్ తెలిపాడు.
Also Read : Asad Rauf Dead: క్రికెట్‌లో విషాదం.. అంపైర్ అసద్ రౌఫ్ కన్నుమూత! విజయవంతమైన అంపైర్‌గా పేరు కానీ
Also Read : Ind vs Pak: ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు అప్పుడే అయిపోయాయా, 5 లక్షలకు పైగా అమ్మకాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook