Ind vs Pak: ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు అప్పుడే అయిపోయాయా, 5 లక్షలకు పైగా అమ్మకాలు

Ind vs Pak: ఇండియా పాకిస్తాన్ దాయాది దేశాల మధ్య క్రికెట్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే నెల తరువాత జరిగే మ్యాచ్ టికెట్లు అప్పుడే అమ్ముడైపోయాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2022, 05:11 PM IST
  • అక్టోబర్ 23న జరిగే టీ20 ప్రపంచ కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్
  • మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ టికెట్లు దాదాపుగా హౌస్ ఫుల్
  • రికార్డు స్థాయిలో 5 లక్షలకు పైగా అమ్మకాలు
Ind vs Pak: ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు అప్పుడే అయిపోయాయా, 5 లక్షలకు పైగా అమ్మకాలు

Ind vs Pak: ఇండియా పాకిస్తాన్ దాయాది దేశాల మధ్య క్రికెట్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే నెల తరువాత జరిగే మ్యాచ్ టికెట్లు అప్పుడే అమ్ముడైపోయాయి..

ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అదొక క్రేజ్. ప్రపంచమంతటికీ ఆసక్తి. ఏం కానుందనే టెన్షన్. అందులో టీ20 ప్రపంచ కప్ అంటే మరీనూ. అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ 2022లో దాయాది దేశాలైన ఇండియా-పాకిస్తాన్‌లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. అక్టోబర్ 23న జరిగే ఈ మ్యాచ్‌కు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక కానుంది. ఇంకా ఈ మ్యాచ్‌కు నెలరోజులు పైనే ఉంది. అయినా ఒక్కసారి ఆన్‌లైన్‌లో సేల్స్ పెట్టగానే శరవేగంగా అయిపోయాయి. 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైపోయాయి. సేల్ ప్రారంభమైన క్షణాల్లోనే అడిషనల్ స్టాండింగ్ రూమ్ టికెట్లు కూడా అమ్మకమైపోయాయి.

టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అధికారికంగా రీ సేల్ వేదిక ఏర్పాటు కానుంది. ఈ వేదికపై అభిమానులు ఫేస్ వాల్యూ ఆధారంగా టికెట్లను మార్చుకునే అవకాశం కల్పిస్తోంది ఎంసీజీ వేదిక. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు దక్కించుకునేందుకు ఇదే చివరి అవకాశం. 

టీ20 ప్రపంచ కప్ 2022 టికెట్ల అమ్మకం ప్రారంభం కావడంపై ఐసీసీ ఈవెంట్స్ హెడ్ సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 5 లక్షల టికెట్లు అమ్ముడైపోవడంతో ఇంకా ఆసక్తి పెరుగుతుందన్నారు. ఇంకా కొన్ని టికెట్లు మిగిలున్నాయని..అభిమానులు త్వరగా దక్కించుకోవాలని కోరారు. 

Also read: Asad Rauf Dead: క్రికెట్‌లో విషాదం.. అంపైర్‌ అసద్‌ రౌఫ్‌ కన్నుమూత! విజయవంతమైన అంపైర్‌గా పేరు కానీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News