పూణె: IPL 2020 మరెంతో దూరంలో లేదు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపిఎల్ 2020 సీజన్‌కు ఈసారి టెలివిజన్‌ రేటింగ్స్‌ ( TV ratings ) మరింత పెరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ( Sourav Ganguly ) పేర్కొన్నాడు. కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుతం కొవిడ్-19 నిబంధనలు అమలులో ఉండటంతో స్టేడియాల్లోకి క్రికెట్ ప్రియులు వచ్చే అవకాశం లేకపోవడంతో మ్యాచులను వీక్షించాలని కోరుకునే వారు టీవీలకు అతుక్కుపోనుండటమే అందుకు కారణం అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. Also read : ‘Sourav Ganguly టీ20లకు పనికిరాడని ముందే ఊహించా’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవిడ్‌-19 ఆంక్షల నేపథ్యంలో ఆడియెన్స్ ఇళ్లకే పరిమితమైతే.. అప్పుడు ఆటోమేటిక్‌‌గా టీఆర్పీ రేటింగ్స్‌ ( TRP ratings ) రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని బ్రాడ్‌కాస్టర్లు సైతం భావిస్తున్నట్లు గంగూలీ చెప్పుకొచ్చాడు. ఆన్‌లైన్ ద్వారా సింబయోసిస్ గోల్డెన్ జూబిలీ లెక్చర్ సిరీస్‌లో పాల్గొని మాట్లాడుతూ దాదా ఈ వ్యాఖ్యలు చేశాడు. Also read : CSK: సురేష్ రైనా ఎక్కువేం కాదు: సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్


ఐపిఎల్ 13వ సీజన్ నిర్వహణ విషయానికొస్తే.. యూఏలోని 3 పెద్ద పెద్ద నగరాల్లో ఈసారి ఐపిఎల్ మ్యాచులు జరగనున్నాయి. దుబాయి, అబు ధాబి, షార్జా ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌కి వేదికలు కానున్నాయి. Also read : FIDE Chess Olympiad: 96 ఏళ్లలో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత్