CSK: సురేష్ రైనా ఎక్కువేం కాదు: సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్

IPL 2020 ఆడేందుకు యూఏఈకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ క్రికెటర్ సురేష్ రైనా వారం రోజులకే ఇంటిబాట పట్టాడు. వ్యక్తిగత సమస్యలతో ఐపీఎల్ నుంచి రైనా వైదొలిగాడని చెన్నై సీఈఓ సైతం తెలిపారు. Suresh Raina Was Unhappy With The Hotel Room Given to Him in Dubai

Last Updated : Aug 31, 2020, 10:52 AM IST
CSK: సురేష్ రైనా ఎక్కువేం కాదు: సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ఆడేందుకు యూఏఈకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) వారం రోజులకే ఇంటిబాట పట్టాడు. వ్యక్తిగత సమస్యలతో ఐపీఎల్ నుంచి రైనా వైదొలిగాడని చెన్నై సీఈఓ సైతం తెలిపారు. జట్టులో కరోనా కేసులు, బంధువు మరణం, కుటుంబం ఆరోగ్యం ఇలాంటి అంశాలపై బెంగతో రైనా ఇంటికి తిరిగొచ్చేశాడని అంతా అనుకుంటుండగా మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. Suresh Raina: దోపిడీ దొంగల దాడిలో సురేష్ రైనా బంధువు మృతి

దుబాయ్ హోటల్‌లో తనకు కేటాయించిన గదిపై రైనా అసంతృప్తి వ్యక్తం చేశాడట. అసలే బయటకు వెళ్లే అవకాశం ఉండదు, బయో బబుల్ కనుక తనకు బాల్కనీ ఉండేలా గది ఇవ్వాలని కోరగా ఎవరూ స్పందించలేదట. ధోనీని సైతం సంప్రదించగా, ప్రస్తుతం తన చేతిలో ఏమీ లేదని చెప్పడం.. మరోవైపు జట్టుల కరోనా కేసుల భయంతో రైనా వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. సీఎస్కే యజమాని దీనిపై సీరియస్‌గా స్పందించారు. ఇష్టం లేకపోతే ఎవరినీ బతిమాలాల్సిన అవసరం లేదన్నారు. FIDE Chess Olympiad: 96 ఏళ్లలో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత్

ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి (జట్టుపై నిషేధం ఉన్న రెండేళ్లు మినహా) సీఎస్కేతో కొనసాగుతున్న రైనా ఇలా చేయడం సబబు కాదన్నారు. తమ వద్ద ప్రతిభకు కొదువలేదని, ఎంఎస్ ధోనీ లాంటి గొప్ప నాయకుడు ఉన్నాడని ధీమా వ్యక్తం చేశారు. కొందరు క్రికెటర్లు పాతతరం సినిమా హీరోల్లా తమను గొప్పగా ఊహించుకుంటారని వ్యాఖ్యానించారు. సీఎస్కే జట్టులో మాకు అందరూ ఒకటే. కుటుంబంలాగ ఉంటారు. అసంతృప్తి ఉంటే వెల్లిపోవచ్చునని, ఐపీఎల్ నుంచి వెళ్లిపోతే రూ.11 కోట్లతో పాటు ఇంకేం కోల్పోయాడే త్వరలోనే రైనా తెలుసుకుంటాడని శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. Virat Kohli: బ్యాట్ పట్టాలంటే భయం వేసింది: కోహ్లీ 
Kieron Pollard: భీకర ఫామ్‌తో ఐపీఎల్‌కు పోలార్డ్

Trending News