మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ సునిల్ గవాస్కర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) బౌలర్ రాషిద్ ఖాన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశాడు. ఐపిఎల్ ( IPL ) ఫ్రాంచైజీలు, కెప్టెన్లు అందరూ కోరుకునే ఒకే ఒక బౌలర్ అతనే అని పొగడ్తలతో ముంచెత్తాడు గవాస్కర్. క్రికెట్ ప్రపంచంలోనే అద్భుతమైన లెగ్ స్పిన్నర్ రాషిద్ ఖాన్ ( Rashid Khan ) అని తన మనసులో మాట చెప్పాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు


మీరు ఏ ఫ్రాంచైజీని అయినా అడగండి.. లేదా కెప్టెన్లను అడగండి. మీకు కావాల్సిన బౌలర్ ఎవరని వారిని అడగండి. వారంతా కలిసి చెప్పేది ఒకటే వారికి కావాల్సింది మాత్రం రాషిద్ ఖాన్ అని. నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను. నేను చెప్పింది వింటే చాలా మంది బౌలర్లకు తప్పుగా అనిపించే అవకాశం ఉంది. కానీ రాషిద్ ఖాన్ ఆటతీరు చూస్తే మాత్రం అలాగే అనిపిస్తుంది అని ఇటీవలే ఒక మ్యాచు తరువాత తెలిపాడు గవాస్కర్ ( Sunil Gavaskar ).


రాషిద్ ఖాన్ వికెట్లు తీస్తాడు. డాట్ బాల్స్ వేస్తాడు. అతని ఎకానమీ చూడండి. 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 12 పరుగులు ఇచ్చాడు. లెగ్ స్పిన్నర్ ఎక్కువగా ఫుల్టాస్ లేడా షార్ట్ బాల్స్ వేస్తాడు. కానీ రాషిద్ ఖాన్ అలాంటిది ఏం చేయడు. ప్రతీ సారి తను అనుకున్న విధంగా బౌలింగ్ చేస్తాడు.. అతని గురి తప్పదు అని తెలిపాడు గవాస్కర్.



ALSO READ|  Cricket Wonders: వీళ్ల బౌలింగ్ లో ఎవరూ సిక్సర్ కొట్టలేకపోయారు


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR